Kishan Reddy: ఇచ్చిన హామీలు అమలుకు.. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో నోట్లు ముద్రించే మిషన్ లు పెడతారేమో అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబు జగ్జీవన్ రామ్ అత్యున్నతమైన ఉప ప్రధాని స్థాయికి ఎదిగారని తెలిపారు. దేశానికి సేవలు చేశారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారన్నారు. గొప్ప ప్రజాస్వామ్యవాది.. ప్రతి పక్షాల గొంతు నొక్కి, పత్రిక స్వేచ్ఛను హరించి ఎమర్జెన్సీ విదించినప్పుడు.. ఆర్ఎస్ఎస్ ను నిషేధించినప్పుడు, కాంగ్రెస్ విధానాలను వ్యతిరేకించి ఆ పార్టీ కి రాజీనామా చేసి బయటకు వచ్చారని తెలిపారు.
Read also: Danam Nagender: 10 నిమిషాల్లో 45 వేల టికెట్లు ఎలా అమ్ముడు పోతాయి..?
జనతా పార్టీ స్థాపనలో ఉన్నారని అన్నారు. జనతా పార్టీ ఆయన్ని ప్రధాన మంత్రి గా ప్రకటించి ఎన్నికలకు వెళితే కాంగ్రెస్ దళితున్ని ప్రధాని కాకుండా అడ్డుకుందన్నారు. విష ప్రచారం చేసి అయన ప్రధాని కాకుండా కాంగ్రెస్ చేసిందన్నారు. ఆయన స్ఫూర్తితో అనేక సంక్షేమ కార్యక్రమాలు మోడీ ప్రభుత్వం చేస్తుందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో పై ఆయన స్పందిస్తూ.. ఇచ్చిన హామీలు అమలుకు.. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో నోట్లు ముద్రించే మిషన్ లు పెడతారేమో అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా గత అసెంబ్లీ ఎన్నికల్లో.. యూత్, మహిళ, రైతు డిక్లరేషన్ ల పేరుతో గ్యారంటీలు ఇచ్చారో దమ్ము, దైర్యం, చిత్తశుద్ధి ఉంటే వాటిని అమలు చేసి చూపాలని డిమాండ్ చేశారు.
Daggubati Purandeswari : రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు..