తెలంగాణలో గత కొన్ని రోజులుగా భారీగా వర్షాల కురుస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఎగువ కర్ణాటక నుండి వస్తున్న వరద కారణంగా జూరాలకు భారీగా నీరు వచ్చి చేరుతుంది. దాంతో ప్రాజెక్టు 41 గేట్లు ఎత్తి దిగువకు 3 లక్షల 80 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు… ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లుకాగా… ప్రస్తుత నీటిమట్టం 316.670 మీటర్లుగా ఉంది. ఇక పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 6.202 టీఎంసీలుగా ఉంది. ఇక ప్రాజెక్టులోని అన్ని యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. అయితే జూరాల నుండి నీటిని విడుదల చేయడంతో దిగువన ఉన్న శ్రీశైలం వైపుకు వరద పోటెత్తింది.