Medigadda Dam: నేడు మేడిగడ్డకు మంత్రుల బృందం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kaleshwaram Project: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి అనేక కారణాల్లో ఒకటి మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం. ఈ కుంగుపాటుతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకి ఉన్న మంచి పేరు కాస్తా పోయింది. దీంతో ఎన్నికల ప్రచారంలో ఈ ప్రాజెక్టు పేరు ఎత్తడానికే బీఆర్ఎస్ వెనకబడిపోయింది. అలా తమకు కలిసొస్తుంది అనుకున్న ప్రాజెక్టే, తమ కొంపముంచింది అని గూలాబీ పార్టీ భావించే పరిస్థితి ఏర్పాడింది. ఈ అగ్గిని అధికార కాంగ్రెస్ మరింత రాజేస్తోంది. మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవ పరిస్థితులను దగ్గరుండి చూసేందుకు ఇవాళ మంత్రుల బృందం అక్కడికి పోతుంది.
Read Also: Gold Price Today: పసిడి ప్రియులకు షాకిస్తున్న బంగారం ధరలు..అదే దారిలో వెండి .. ఎంతంటే?
Also Read
- Jayashankar Bhupalpally: ఘోర రోడ్డు ప్రమాదం.. DTO పైకి దూసుకెళ్లిన బొగ్గు టిప్పర్.!
- Junior Civil Judge Court: కాటారం రెవెన్యూ డివిజన్‌కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు..
- CM Revanth Reddy : కేసీఆర్ పగటి కలలు మానుకోవాలి.. కల్వకుంట్ల కుటుంబానికి ఇక రాజకీయ నూకలు చెల్లినట్టే
- CM Revanth Reddy : కాళేశ్వరం కేసీఆర్ అవినీతికి సాక్ష్యం.. రీ-డిజైన్ పేరుతో భారీ దోపిడీ..
అయితే, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు నేడు కాళేశ్వరం ప్రాజెక్టును ఏరియల్ సర్వే చేసిన తర్వాత మేడిగడ్డ డ్యామ్ 19, 20, 21 పిల్లర్లు ఎందుకు కుంగిపోయాయో దగ్గరకు వెళ్లి చూస్తారు. ఈ పిల్లర్లు కుంగిపోవడం వల్ల తెలంగాణ- మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోవడానికి గల కారణాలను పరిశీలిస్తారు. అలాగే, అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. ఇందు కోసం నీటి పారుదల శాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Also: Weather Update Today: ఉత్తర భారతదేశంలో దట్టమైన పొగమంచు.. 11 రాష్ట్రాలకు వర్షసూచన
కాగా, ఈ ప్రాజెక్టుకు ఈ పరిస్థితి రావడం వెనక బీఆర్ఎస్ అవినీతి కారణం అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఇంజినీరింగ్ వైఫల్యంపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో వెల్లడించింది. కేంద్రం జల వనరుల సంస్థ అనుమతి లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారనే వాదన కొనసాగుతుంది. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించేందుకు శ్రీకారం చూట్టారు. దీనికి మహారాష్ట్ర ఒప్పుకోలేదు.. కానీ, ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని మార్పులతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. మహారాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలని లెక్కలోకి తీసుకొని, డిజైన్ మార్చడం వల్ల వ్యయం పెరగడంతో పాటూ, టెక్నికల్ గానూ లోపాలు ఏర్పడ్డాయనే వాదన కాంగ్రెస్ తెర పైకి తీసుకొస్తుంది. అందుకు తగ్గట్టుగానే కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగిపోవడంతో విమర్శలకు మరింత బలం పెరిగింది.
తాజావార్తలు
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
-
BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయ సినిమా స్టార్ట్
-
CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
ట్రెండింగ్
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..