తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి అనేక కారణాల్లో ఒకటి మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం. ఈ కుంగుపాటుతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకి ఉన్న మంచి పేరు కాస్తా పోయింది. దీంతో ఎన్నికల ప్రచారంలో ఈ ప్రాజెక్టు పేరు ఎత్తడానికే బీఆర్ఎస్ వెనకబడిపోయింది.
విజయవాడలోని పీడబ్ల్యూ గ్రౌండ్ లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్న ప్రదేశాన్ని మంత్రుల బృందం సోమవారం సందర్శించింది. మంత్రులు పినిపే విశ్వరూప్, వెల్లంపల్లి శ్రీనివాస్, ఆదిమూలపు సురేష్ లతో పాటు అధికారులు స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రలు మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు నిధులను గ్రీన్ ఛానల్ లో పెడతాం అని సీఎం హామీ ఇచ్చారని, 12.5 అడుగుల మోడల్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని వారు తెలిపారు. 25 అడుగుల నమూనా విగ్రహం త్వరలో పెడతామని,…