Bhupalpalli: సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య కేసులో పోలీసుల పురోగతి..
- సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగ మూర్తి హత్య కేసులో పోలీసుల పురోగతి
- మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్పీ ఆధ్వర్యంలో 4 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు
- హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, ఆటో, రెండు బైకులు స్వాధీనం
- ఐదుగురిని అదుపులోకి తీసుకొని ప్రత్యేకంగా విచారిస్తున్న సీసీఎస్ పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో జరిగిన సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగ మూర్తి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. రాజలింగ మూర్తి భార్య సరళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్పీ కిరణ్ ఖరే ఆధ్వర్యంలో 4 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, ఒక ఆటో, రెండు ద్విచక్ర వాహనాలతో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకొని సీ.సీ.ఎస్ పోలీసులు ప్రత్యేకంగా విచారించారు. రాజలింగ మూర్తి హత్యకు ప్రధాన కారణంపై పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ముందుగల 319, 320, 171 సర్వే నెంబర్‌లోని భూమిలో తలెత్తిన వివాదాలే రాజలింగ మూర్తి హత్యకు దారి తీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Read Also: Telangana: మహిళా శిశు సంక్షేమ శాఖలో కొలువుల జాతర..
Also Read
- Jayashankar Bhupalpally: ఘోర రోడ్డు ప్రమాదం.. DTO పైకి దూసుకెళ్లిన బొగ్గు టిప్పర్.!
- Junior Civil Judge Court: కాటారం రెవెన్యూ డివిజన్‌కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు..
- CM Revanth Reddy : కేసీఆర్ పగటి కలలు మానుకోవాలి.. కల్వకుంట్ల కుటుంబానికి ఇక రాజకీయ నూకలు చెల్లినట్టే
- CM Revanth Reddy : కాళేశ్వరం కేసీఆర్ అవినీతికి సాక్ష్యం.. రీ-డిజైన్ పేరుతో భారీ దోపిడీ..
319, 320, 171 సర్వే నెంబర్‌లోని రేణికుంట్ల సంజీవ్, వంశీ కృష్ణ అనే వ్యక్తులకు రాజలింగ మూర్తికి ఉన్న భూ వివాదమే హత్యకు దారి తీసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం తెలుస్తోంది. రేణికుంట్ల సంజీవ్, కొమురయ్య, వంశీ కృష్ణ ఫోన్ కాల్ రికార్డుల ఆధారంగా విచారణలో పురోగతి సాధించారు పోలీసులు. రాజలింగ మూర్తిపై దాడి జరిగిన తర్వాత భూపాలపల్లిలోని స్థానిక బీఆర్ఎస్ నేతకు ఈ ముఠా సభ్యులు ఫోన్ చేశారు. అతనికి నిందితులకు దగ్గర సంబంధాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ హత్యలో బీఆర్ఎస్ నేత పాత్ర పై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. రాజలింగమూర్తి హత్యలో మరి కొంతమంది పాత్రపై పోలీసులు విచారణ చేస్తున్నారు. రాజలింగమూర్తి హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న వారి సంఖ్య ఐదుగురైన.. పరోక్షంగా మరి కొంత మంది సహకరించారనే వివరాలను పోలీసులు రాబడుతున్నారు. రేపటిలోగా రాజలింగమూర్తి హత్య కేసు కొలిక్కి తీసుకొచ్చే దిశగా పోలీసుల విచారణ కొనసాగుతుంది.
Read Also: Tesla : కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తర్వాత ఎలోన్ మస్క్ టెస్లాకు భారీ ఆఫర్లు
తాజావార్తలు
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!