భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో జరిగిన సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగ మూర్తి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. రాజలింగ మూర్తి భార్య సరళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్పీ కిరణ్ ఖరే ఆధ్వర్యంలో 4 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ముమ్మరం చేశారు.
తెలుగు రాష్ట్రాల్లోనే ప్రముఖ గిరిజన ఆలయంగా వెలుగొందుతున్న మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయం నీట మునిగింది. గ్రామంలోకి భారీగా వరద నీరు చేరుకుంటోంది. గోవిందరావు పేట మండలంలోని పస్రా, తాడ్వాయి మధ్యలో ఉన్న 163వ నెంబర్ జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహించడంతో కోతకు గురైంది. దీంతో తాడ్వాయి, ఏటూరు నాగారం మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.