భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో జరిగిన సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగ మూర్తి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. రాజలింగ మూర్తి భార్య సరళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్పీ కిరణ్ ఖరే ఆధ్వర్యంలో 4 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ముమ్మరం చేశారు.