Revanth Reddy: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని, డీసీసీ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ లను హౌస్ అరెస్ట్ చేయడం పట్ల టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మపురి నియోజక వర్గం వెల్కటూర్ మండలంలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేయడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే అరెస్టులతో నిర్బంధిస్తారా? అంటూ ప్రశ్నించారు. జీవన్ రెడ్డి, లక్ష్మణ్ కుమార్ ల్ లాంటి ప్రజా నాయకులను నిర్బంధిస్తే ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇథనాల్ ప్రాజెక్టు ఏర్పాటు వల్ల ఆ ప్రాంతంలో కాలుష్యం అవుతుందని, ప్రజలు, రైతులు ఇథనాల్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్నారని తెలిపారు. ప్రజల పోరాటానికి జీవన్ రెడ్డి, లక్ష్మణ్ కుమారులు సంఘీభావం ప్రకటిస్తే హౌస్ అరెస్ట్ చేస్తారా? ఇది ప్రజాస్వామ్యమా? అంటూ మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ మండలి నాయకుణ్ణి నిర్బంధిస్తారా? జీవన్ రెడ్డి, లక్ష్మణ్ కుమార్ లను వెంటనే విడుదలచేసి పోరాటంలో భాగస్వాములను చేయాలని డిమాండ్ చేశారు. రైతులు, ప్రజలు కోరుకున్న విధంగా విధానాలను అమలు చేయాలని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాషిగామ గ్రామంలో ఇథనల్ ప్రాజెక్ట్ బాధిత గ్రామస్తులకు సంఘీభావం తెలపడానికి వెళ్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరంకుశ, నియంతృత్వ పాలన సాగుతోందని మండిపడ్డారు. దొంగచాటుగా ఇథనాల్ పరిశ్రమకు శంకుస్థాపన పై ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతనాల్ పరిశ్రమ తో పరిసరాలు కలుషితం అవుతుందని, నిర్భందాలతో ప్రజాస్వామ్య హక్కులు కాలరాస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అర్థమే మారిపోతోందని అన్నారు. ఇథనాల్ ప్రాజెక్టుకు ఉపయోగించిన నీటితో కాలేశ్వరం నీరు కలుషితమవుతాయన్నారు. ఎనిమిది సంవత్సరాలు గడిచిన చక్కెర ఫ్యాక్టరీని తెరిపించలేని అసమర్ధ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇథనల్ ప్రాజెక్టు ఏర్పాటు చేసి ప్రాంతాన్ని కలుషితం చేస్తున్నాడని ఆరోపణలు చేశారు.
RSS chief Mohan Bhagwat: పాక్ ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు.. విభజన పొరపాటుగా జరిగింది..