Modi visit to Hyderabadr: అతి తక్కువ ఖర్చుతో నగరంలో ప్రయాణించే రోజులు దగ్గరకు వచ్చాయి. ఈనెల 8న హైదరాబాద్ కు రానున్న ప్రధాని మోదీ ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా రైళ్లను ప్రారంభించనున్నారు. దీంతో మేడ్చల్ – సికింద్రాబాద్ – ఉందానగర్, మేడ్చల్ – సికింద్రాబాద్ – తెల్లాపూర్ ఎంఎంటీఎస్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. రైళ్లు అందుబాటులోకి రావడం ద్వారా నగరంలోని 50 కి.మీ మేర కేవలం రూ. 10-15 టికెట్ తో ప్రయాణించవచ్చని తెలిపారు. ప్రధాని మోదీ ఇక నుంచి నెలకోసారి తెలంగాణలో అధికారికంగా పర్యటించాలని భావిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించిన తెలిసిందే.. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మొత్తం రూ.13,500 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఏప్రిల్ 8న ప్రధాని ప్రారంభిస్తారని వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర అధికారుల సమావేశంలో కిషన్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొని తీసుకున్నారు.
ఏప్రిల్ 8న ప్రధాని నరేంద్ర మోదీ నగరానికి రానున్న నేపథ్యంలో ఆయన రాక ఏర్పాట్లలో పార్టీ నేతలు ఇప్పటి నుంచే నిమగ్నమయ్యారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన సభలో తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయాలని మోదీ కృతనిశ్చయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో భాజపాను ప్రజలు ఆదరిస్తున్నారని, ఆ పార్టీ కార్యక్రమాలకు మంచి స్పందన వస్తోందని, అధికారంలోకి వచ్చేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మోడీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంటోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభోత్సవంలో కూడా ఆయన పాల్గొంటారు. అలాగే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారని సమాచారం. సభ ఏర్పాట్లతో పాటు ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ కసరత్తు చేస్తోంది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ పర్యటన రద్దయింది. మార్చి 31న జేపీ నడ్డా సంగారెడ్డి జిల్లా పార్టీ ఆఫీసును ప్రారంభించాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమాన్ని వర్చువల్ ద్వారా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించారు మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ నుంచి వర్చువల్ గా సంగారెడ్డి, భూపాలపల్లి, వరంగల్, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్ తో పాటు ఏపీలోని అనంతపురం, చిత్తూరు జిల్లా పార్టీ కార్యాలయాలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రారంభించారు. అనంతరం అక్కడి నుంచే కార్యకర్తలను ఉద్దేశించి నడ్డా ప్రసంగించారు. సంగారెడ్డి జిల్లా కందిలో జరిగే పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి జి. కిష న్రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్, జాతీయ ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ హాజరయ్యారు.
YouTube Village : యూట్యూబర్ల గ్రామం.. ఎక్కడ ఉందో తెలిస్తే షాక్ అవుతారు..