బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు పై మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. హరీష్ రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తా అంటున్నాడని, దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది కేసీఆర్ కుటుంబమని ఆయన మండిపడ్డారు. ఇన్ని మాటలు చెప్పి మోసం చేసిన కేసీఆర్ కుటుంబం కి రాహుల్ గాంధీ ఇంటి ముందు దీక్ష చేసే హక్కులేదని, ఒక్క హామీ అమలు చేయని నువ్వు రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తా అంటే మేము ఊరుకుంటామా? అని ఆయన ధ్వజమెత్తారు. నువ్వు..నీ మామ మోసాల కుటుంబం.. ప్రజలను మోసం చేసినందుకు.. కేసీఆర్ ఫాం హౌస్ దగ్గర దీక్ష చేస్తా అని, నువ్వు ఢిల్లీ పోయినా రోజే..నేను మీ మామ ఎక్కడ ఉంటే అక్కడ దీక్ష చేస్తా అని ఆయన అన్నారు. రేవంత్ మొనగాడు అని హరీష్ ఒప్పుకున్నాడని, మోసగాళ్లకు మోసగాడు కేసీఆర్ అని, మీ మోసాల ముందు మేము ఏం పనికి రామని ఆయన వ్యాఖ్యానించారు. మోసం చేయడం లో నెంబర్ 1 మీరే అని, కేసీఆర్ ది రైతు గుండె అనడం అన్యాయం.. తొమ్మిదిన్నర యేండ్ల తర్వాత గుర్తుకు వచ్చిందా..? హరీష్ అని ఆయన ప్రశ్నించారు.
Gopi Chand : మరోసారి ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న గోపీచంద్
అంతేకాకుండా..’కేసీఆర్ ది రైతు గుండె ఐతే.. మల్లన్న సాగర్ రైతులను పోలీసులతో కొట్టించినప్పుడు ఏమయ్యాడు. మీ మామ గుండె అప్పుడు.. ఫ్రిజ్ లో పెట్టిండా. విచిత్రమైన గుండెలు ఉన్నాయి మీకు హరీష్.. ఖమ్మం లో రైతులకు బేడీలు వేసినప్పుడు ఏమైంది కేసీఆర్ గుండె కి.. రైతులకు వ్యతిరేకం వాళ్ళ ప్రభుత్వం కాబట్టి పడిపోయింది.. మా ప్రభుత్వం వచ్చింది.. మా పాలనలో లోపాలు ఉంటే.. సరిదిద్దుకుంటాం.. మమ్మల్ని రాష్ట్రంలో తిరగనివ్వ కుండా ఆపే దమ్ము కేటీఆర్..హరీష్ కి లేదు.. పంట రుణాలపై హరీష్ కి జగ్గారెడ్డి సవాల్.. రుణమాఫీ పై.. కేసీఆర్ నీ చర్చకు రమ్మను దమ్ముంటే నువ్వు ఒప్పించు.. నేను సిఎం రేవంత్ నీ ఒప్పిస్తా.. ‘ అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
Game Changer : గేమ్ ఛేంజర్.. థర్డ్ సాంగ్ లెక్క వేరే?