Jagadish Reddy: మునుగోడు ఉప ఎన్నిక రాజకీయ ప్రచారం హోరా హోరీగా సాగుతుంది. నువ్వా నేనా అన్నట్లుగా సభలు, ప్రచారాలు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో.. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై మంత్రి జగదీష్ రెడ్డి విరుచుకు పడ్డారు. రాజగోపాల్ రెడ్డికి సవాల్ విసిరి.. స్వీకరించాలని అన్నారు. అసలు ఉప ఎన్నికే వద్దు.. టీఆర్ఎస్ నామినేషన్ కూడా వేయం..
కేంద్రం రాజగోపాల్ కాంట్రాక్ట్ డబ్బులు మునుగోడుకి ఇవ్వాలని మంత్రి కోరారు. 18 వేల కోట్లకు రాజగోపాల్ అమ్ముడు పోయారని ఆరోపించారు. రాజగోపాల్ కు డెడ్ లైన్ పెడుతున్నానని, తన సవాల్ స్వీకరించాలని అన్నారు. ఈనెల 13 వరకు టీఆర్‌ఎస్ నామినేషన్ వేయమని, ఆలోపు రాజగోపాల్ నిర్ణయం తీసుకోవాలని సవాల్ విసిరారు.
కేంద్రం నుంచి మునుగోడుకు రాజగోపాల్ కాంట్రాక్ట్ విలువ చేసే డబ్బులు 18 వేల కోట్లు ఇప్పించమని అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక నుంచి తప్పు కుంటామని మంత్రి జగదీష్ రెడ్డి సంచళన వ్యాఖ్యలు చేశారు.
Read also: KTR Challenge: రాజగోపాల్ రెడ్డికి ఛాలెంజ్.. గుడికి రా.. సంజయ్, మోడీ మీద ఒట్టు వెయ్యి
రాజగోపాల్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ సవాల్:
బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. 18వేల కోట్ల కాంట్రాక్టులు వదులుకో లేదంటే.. హైదరాబాద్ భాగ్యలక్ష్మి గుడికి రా.. మీ గుండు సంజయ్ మీద ఒట్టు వెయ్యి కాంట్రాక్టులు రాలేదని అంటూ ఛాలెంజ్ చేశారు. ఇక్కడ ఎవడేవేడో వచ్చి రాజకీయాలు చేస్తారు… కానీ తెలంగాణ వాళ్ళు దేశంలో రాజకీయాలు చేయడం తప్పా ? అంటూ ప్రశ్నించారు. 18వేల కోట్ల కాంట్రాక్టులు వదులుకోవాలని లేదంటూ హైదరాబాద్ భాగ్యలక్ష్మి గుడికి వచ్చి మీ గుండు సంజయ్ మీద ఒట్టు వెయ్యి కాంట్రాక్టులు రాలేదని ఒప్పుకోమన్నారు. లేదంటే యాదాద్రికి వచ్చి మీ మోడీ మీద ఒట్టు వెయ్యి అంటూ సవాల్ విసిరారు మంత్రి కేటీఆర్.
Read also: Face Packs For Men: మగవారి కోసం.. బెస్ట్ ఫేస్ ప్యాక్స్
రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ కుటుంబంపై విమర్శలు
రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ కుటుంబంపై విమర్శల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.. నిన్న నామినేషన్ అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబానికి చీము, నెత్తురు, సిగ్గు, సరం వుంటే ఏమి ఎంక్విరీ చేస్తావో చెయ్ అంటూ సవాల్ విసిరారు. కేసీఆర్ దొంగలను పెంచిపోసిస్తున్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాదర్ కిషోర్ ఇసుక మాఫియా, గ్రానైట్ మాఫియా, లాండ్ మాఫియా చేస్తాడు అంటూ ఆరోపించారు. రుజువులుంటే ముందుకు రావాలని అన్నారు ఎటువంటి దానికైనా సిద్దమని అన్నారు. నన్ను కొనేశక్తి ఈప్రపంచంలో పుట్టలేదు పుట్టబోదని అమిషా మీటింగ్ లోనే సభా ముఖంగా తెలిపానని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
MadhyaPradesh: బోరింగ్ కొడితే చాలు.. బక్కెట్ల కొద్ది బీరు.. అవాక్కైన పోలీసులు