అలోవెరా జెల్‌లో కొద్దిగా నిమ్మరసం కలిపి.. ఈ మిశ్రమాన్ని మెడ, ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి
అలోవెరా జెల్‌లో మామిడి గుజ్జు మిక్స్ చేసి, ముఖానికి అప్టై చేసి, 20 నిమిషాల తర్వాత శుభ్రంగా కడగాలి
రెండు స్ట్రాబెర్రీ పండ్లను పేస్ట్‌లా చేసి.. కొద్దిగా కోకో పౌడర్, తేనె, పచ్చి పాలు కలిపి.. ఈ పేస్ట్‌ని ముఖానికి రాయాలి, 15 నిమిషాల తర్వాత కడగాలి
కీరదోస ముక్కలు, పుదీనా, తేనె మిక్స్ చేసి.. పేస్ట్‌లా తయారు చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి, స్మూత్‌గా స్క్రబ్ చేయాలి
అలోవెరా జెల్‌లో కొద్దిగా రోజ్ వాటర్ వేసి, ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి
అలోవెరా జెల్‌లో కొద్దిగా తేనెను మిక్స్ చేసి.. ముఖం, మెడ ప్రాంతంలో అప్లై చేసి, 20 నిమిషాల తర్వాత కడిగేయాలి
దోసకాయ రసంలో పెరుగు, అలోవెరా జెల్ మిక్స్ చేసి.. ముఖానికి అప్లై చేసి, చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి
బొప్పాయి గుజ్జులో కొద్దిగా నిమ్మరసం, పాలు మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, తర్వాత కడిగేయాలి
అరటిపండు గుజ్జులో రోజ్ వాటర్, ఆలివ్ ఆయిల్, కోకా బట్టర్ వేసి మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి