MadhyaPradesh: బోరింగ్ కొడితే చాలు.. బక్కెట్ల కొద్ది బీరు.. అవాక్కైన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MadhyaPradesh: ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరు మద్యమే అనడంతో సందేహమే లేదు. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో మద్యం ఏరులై పారుతోంది. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమ మద్యాన్ని తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. దీనిని నివారించేందుకు ఎక్సైజ్ అధికారులు ఎంత ప్రయత్నించినా ఫలితం ఆ కొద్ది కాలమే.. మళ్లీ యధావిధిగా తయారీ, సరఫరా జరుగుతూనే ఉంటోంది. కానీ ఎక్కడా లేని విధంగా చేతిపంపు కొడితే మద్యం వచ్చేలా సెట్ చేసిన మద్యం అక్రమ తయారీదారుల ఉపాయానికి మెచ్చుకోవాల్సిందే. అయితే, ఆ మధ్య కాలంలో ఏపీలోని గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు చేసిన కొన్ని ప్రాంతాల్లో ఆయిల్ లాంటి ద్రవం ఉద్భవించినట్టుగా వార్తలు వినిపించాయి. కానీ, ఇక్కడ మాత్రం హ్యాండ్ పంప్‌ను వాడిన ప్రజలకు బక్కెట్ల కొద్దీ మద్యం బయటకు వస్తుంది. అది చూసిన పోలీసులు అవాక్కయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గుణాలో వెలుగు చూసింది.
Read Also: Viral Video: బ్రేక్ డ్యాన్స్ చేస్తున్న ఏనుగు.. స్టెప్పులు అదుర్స్ అంటూ కామెంట్లు
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్‌పై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశాల మేరకు పోలీసులు, ఎక్సైజ్ శాఖ, స్థానిక యంత్రాంగం వివిధ జిల్లాల్లో దాడులు నిర్వహిస్తున్నాయి. దీనికి సంబంధించి పోలీసులు గుణలో దాడి చేయగా, వారికి ఒక చేతి పంపు దొరికింది. దాని నుండి నీరు కాదు, మద్యం బయటకు వస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అక్రమ మద్యం అమ్మకాల కోసం ఎవరికీ అనుమానం రాకుండా ఓ చేతి పంపును ఏర్పాటు చేశారు. పోలీసులు చేతి పంపు కొట్టి చూసి ఆశ్చర్యపోయారు. ఇక్కడ చేతి పంపు నుంచి నీళ్లకు బదులు మద్యం రావటంతో ఖాకీలు కంగుతిన్నారు. అక్రమ మద్యం స్థావరాలపై పోలీసులు జరిపిన దాడుల్లో సుమారు 6 వేల లీటర్ల కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. భాన్‌పురాలో నిందితులు ట్యాంక్‌ను భూమిలో పాతిపెట్టి చేతి పంపును అమర్చారు. పోలీసులు చేతిపంపు కొట్టగానే అందులో నుంచి మద్యం రావడం మొదలైంది. వివిధ ప్రాంతాల్లో దాడులు జరిపిన పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
आपने हैंडपंप से पानी निकलते देखा होगा, अब अवैध शराब निकलती देखिए, तस्वीर #MadhyaPradesh के #गुना की है,@ChouhanShivraj के निर्देश के बाद पुलिस की नशे के खिलाफ कार्रवाई जारी है।@drnarottammisra @DGP_MP pic.twitter.com/qiuZ2IZjm6
— Makarand Kale (@makarandkale) October 11, 2022
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..