TS Weather: భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. హైదరాబాద్‌లోనూ ఎండల తీవ్రతకు ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. మూసాపేటలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఐఎండీ ప్రకారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి.
Read also: Car Accident: దుండిగల్ లో కారు బీభత్సం.. ఒకరు మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు
నిర్జలీకరణాన్ని నివారించడానికి ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్, ఇంట్లో తయారుచేసిన లస్సీ, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైన పానీయాలను త్రాగండి. ఆదివారం ఎండ ధాటికి ప్రజలు అల్లాడిపోయారు. తెలంగాణ రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రెండు జిల్లాల్లో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో అత్యధికంగా 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో 42.6 డిగ్రీలు, ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో 42.6 డిగ్రీలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో 2.5 డిగ్రీలు, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో 42.4 డిగ్రీలు, మాడుగులపల్లి జిల్లా మాడుగులపల్లి మండలంలో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పులు.. జరిపింది వాంటెడ్ గ్యాంగ్‌స్టర్!