MLC Polling: ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అధికారులు ఓటింగ్ సజావుగా సాగేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఎన్నికల కు సంబంధించి పోలింగ్ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జిల్లా కేంద్రం నుంచి పోలింగ్ స్టేషన్ లకు జంబో, మిని బ్యాలెట్ బాక్స్ లను తరలిస్తున్నారు.. పోలింగ్ పూర్తి అయిన తరువాత మళ్ళీ ఈ బాక్స్ లు జిల్లా కేంద్రానికి చేరుకుంటాయి. ఆ తరువాత ఇక్కడ నుంచి నల్గొండ కు భద్రతా మధ్య తరలిస్తారు.. మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు.
Read also: Devotees to Temples: ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి నాలుగు గంటల సమయం
ఖమ్మం జిల్లాలోని పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సామగ్రిని ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్ కళాశాలలో, భద్రాద్రి జిల్లాకు సంబంధించిన పోలింగ్ సామగ్రిని రామచంద్ర డిగ్రీ కళాశాలలో ఆదివారం పంపిణీ చేయనున్నారు. ఖమ్మం జిల్లాలో 118, భద్రాద్రి కొత్తగూడెంలో 55 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ సిబ్బందికి ఇప్పటికే తొలి విడత శిక్షణ ఇచ్చారు. ఆదివారం పోలింగ్ సామగ్రి పంపిణీ సందర్భంగా రెండో విడత శిక్షణను ప్రారంభిస్తారు. పోలింగ్ నిర్వహణకు సంబంధించి ఏవైనా సందేహాలను నివృత్తి చేసేందుకు జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనీలు అందుబాటులో ఉంటారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో ప్రిసైడింగ్ అధికారి (పీఓ), అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ (ఏపీఓ) మరియు ఇతర పోలింగ్ అధికారులు (ఓపీఓలు) విధులు నిర్వహించనున్నారు.
Drinkers Hulchul: ఒకడు తాగి జనాల్ని గుద్దేస్తాడు..ఓ అమ్మాయి తాగేసి అరాచకం చేస్తుంది.!