రోజూ గుప్పెడు వేరుశెనగలు లేదా పది గ్రాముల నట్స్ తినండి ఆరోగ్యంగా జీవించండి అంటున్నారు నెదర్లాండ్స్కు చెందిన మాస్ట్రిట్చ్ యూనివర్శిటీ పరిశోధకులు. వారి పరిశోధనల ప్రకారం రోజూ వేరుశెనగలు, నట్స్, డ్రైఫ్రూట్స్ తింటే ఆయుష్షు పెరుగుతుందని తెలిసిందట. శరీరానికి కావల్సిన పోషకాలను అందించి అనారోగ్యాలను నివారించే నట్స్, వేరుశెనగలు రోజూ తీసుకోవడం వల్ల జీవిత కాలం పెరుగుతుందని సూచిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకోవడానికి వాళ్లు ముప్పై సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా లక్షా ఇరవైవేల మంది జీవనవిధానాన్ని పరిశీలించారట.
ముఖ్యంగా తమ పరిశోధనలు 55-69 ఏళ్ల వారిపై చేసినట్లు, రోజూ పది నుంచి పది హేను గ్రాముల నట్స్ లేదా పల్లీలు వారికి ఇచ్చామని కొన్ని సంవత్సరాల తర్వాత వారిలో అనారోగ్య సమస్యలు చాలామటుకు తగ్గిపోయి.. ఉత్సాహంగా కనిపించారని వెల్లడించారు. దశాబ్దాల పాటు వారిని గమనిస్తే.. వారి జీవనకాలం కూడా పెరిగినట్లు తెలుస్తోందన్నారు. వేరుశెనగలను రోజుకు పది నుంచి పదిహేను గ్రాముల వరకు తీసుకునే వారిలో హృద్రోగ సమస్యలు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధులు తగ్గాయని ఈ పరిశోధనల్లో స్పష్టమైంది. నట్స్లోని కాంపౌండ్లు, విటమిన్లు, ఫైబర్, యాంటీయాక్సిడెంట్లు, బయోయాక్టివ్ కాంపౌండ్స్ డెత్ రేట్స్ను తగ్గిస్తాయని నిపుణులు వివరిస్తున్నారు. రాత్రి నాన పెట్టి.. ఉదయం తింటే మరీ మంచిదంటున్నారు న్యూట్రీషియన్లు. . సో.. మీరు కూడా రోజూ గుప్పెడు పల్లీలు తినండి. ఆరోగ్యంగా బతకండి.
Rishabh Pant: ఎంత పని చేశావ్ పంత్.. రివర్స్ స్వీప్ షాట్‌పై మాజీలు ఫైర్