కొప్పుల ఈశ్వర్ కి చిత్తశుద్ధి ఉంటే ఈ నెల 24న కోర్టుకి హాజరు అయ్యి రికౌంటింగ్ సిధ్ధంగా ఉన్నానని పిటిషన్ వేయాలని ధర్మపురి కాంగ్రెస్ ఇంచార్జ్ అడ్లూరి లక్ష్మన్ కుమార్ సవాల్ విసిరారు. కరీంనగర్ జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన 2018 లో ధర్మపురి అసెంబ్లీ 3 ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. చివరి పదకొండు రౌండ్లలో ఐదు ఈవీఎం మిషన్లు పనిచేయలేదని, అప్పటి కలెక్టర్ పై అనుమానం వ్యక్తం చేస్తూ అబ్జర్వర్ కి ఫిర్యాదు చేసానని పేర్కొన్నారు. ఈ వ్యవహారమంతా సీసీ ఫుటేజ్ లో రికార్డు అయ్యిందని పలికారు. పైస్తాయిలో ఒత్తిడి చేసి ఏకపక్షంగా వ్యవహరించి కొప్పుల ఈశ్వర్ గెలిచారని ప్రకటించారని తీవ్ర విమర్శలు చేశారు. నాకు ఇచ్చిన సర్టిఫైడ్ కాపీకి వారిచ్చిన కాపీలో పోలైన ఓట్లు లెక్కించిన ఓట్లలో తేడా వచ్చిందని అన్నారు. దీనిపై అసెంబ్లీ సెక్రెటరీ కి నోటీసు ఇచ్చిన అసెంబ్లీ సెక్రటరీ తిరస్కరించారని ఆరోపించారు.
తను కోర్టును, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని నమ్ముతున్నానని అన్నారు. తను వేసిన పిటిషన్ కొట్టివెయ్యాలని కొప్పుల ఈశ్వర్ నాపై పిటిషన్ దాఖలు చేసారని అన్నారు. రీకౌంటింగ్ జరపాలని నేను కోర్టుకి వెళ్లాను కానీ.. సుప్రీంకోర్టు కి వెళ్ళిన కొప్పుల ఈశ్వర్ పిటిషన్ ని డిస్మిస్ చేసిందని అన్నారు. ధర్మపురి అసెంబ్లీ రికౌంటింగ్ సిధ్ధంగా ఉన్నానని నిజాయితీ చాటు కోవాలని అన్నారు. కౌంటింగ్ కి సంబంధించిన సీసీఫుటేజ్ కావాలని అడిగినా, ఇప్పటికి నాకు సమాధానం లేదని అడ్లూరి లక్ష్మన్ కుమార్ అన్నారు. ఒక దళితునికి అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రి ఇప్పటికి స్పందించలేదని విరుచుకుపడ్డారు. ఆర్థిక బలం, అంగబలంతో కొప్పుల ఈశ్వర్ ఎలక్షన్ కమిషన్ ని, కలెక్టర్ లని శాసిస్తున్నాడని ఆరోపించారు. కొప్పుల ఈశ్వర్ కి చిత్తశుద్ధి ఉంటే ఈ నెల 24న కోర్టుకి హాజరు అయ్యి రికౌంటింగ్ సిధ్ధంగా ఉన్నానని పిటిషన్ వేయాలని సవాల్ విసిరారు అడ్లూరి లక్ష్మన్ కుమార్.
TS MLHP Recruitment 2022: మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీ.. మార్గదర్శకాలు జారీ