పైరసీ సైట్ ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమంది రవి అరెస్టైన విషయం తెలిసిందే. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడు రవి కస్టడీకి అనుమతిస్తూ హైదరాబాద్ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఐదు రోజుల కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి నుంచి ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించనున్నారు. పైరసీ మాఫియాకు సంబంధించిన వివరాలు రాబట్టే పనిలో పోలీసులు ఉన్నారు.
Also Read: Daryl Mitchell: డారిల్ మిచెల్ అరుదైన ఘనత.. మెకల్లమ్, కేన్, గప్తిల్, టేలర్‌కు సైతం సాధ్యం కాలే!
వారం రోజుల పాటు ఇమంది రవిని కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో సైబర్ క్రైమ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న జడ్జి.. రవిని ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతించారు. కస్టడీ విచారణలో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసుపై ఈడీ దృష్టి సారించింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసీ మూవీ రాకెట్ ఐబొమ్మ కీలక సూత్రధారి రవిని సైబర్ క్రైమ్ పోలీసులు గత శనివారం కూకట్‌పల్లిలో అరెస్టు చేశారు. ఓటీటీ వేదికల్లోని కంటెంట్ సహా కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు పైరసీ చేస్తూ సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగించాడు. గత ఏడేళ్లుగా ఐ బొమ్మ, బప్పం, ఐవిన్, ఐరాధ టీవీ పేర్లతో వెబ్‌సైట్‌లు నిర్వహించాడు.