HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్.. వెంటనే తొలగించాలని ఆదేశం.!
- రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం
- 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లపై ప్రశ్నలు
- లోతుకుంట భూముల వివాదమే కారణం
- కొత్త కమిషనర్ నియామకానికి ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ వ్యాప్తంగా వార్తల్లో నిలిచిన ‘హైడ్రా’ కమిషనర్, ఐపీఎస్ అధికారి ఏ.వి. రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో ఊహించని షాక్ తగిలింది. వరుస కోర్టు ధిక్కరణ కేసులపై విచారణ జరిపిన న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. రంగనాథ్‌ను వెంటనే హైడ్రా కమిషనర్ పదవి నుంచి తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)ని ఆదేశించింది. అంతేకాకుండా, ఆయన స్థానంలో మరో అధికారిని నియమించాలని ప్రభుత్వానికి సూచించింది.
లోతుకుంట భూముల వివాదం.. కోర్టు ఆగ్రహం
సికింద్రాబాద్ సమీపంలోని లోతుకుంట సర్వే నెంబర్లు 1, 2 పరిధిలో ఉన్న 40 ఎకరాల భూములకు సంబంధించి ‘శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్’ వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు తమ భూముల్లోకి వచ్చి జోక్యం చేసుకుంటున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. ఏకంగా 63 కోర్టు ధిక్కరణ కేసులు ఒక్క అధికారిపైనే ఉండటం ఏంటని ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వులను పదే పదే లెక్కచేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది.
Also Read
- Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- South Central Railway : మౌలాలిలో రైళ్లకు బ్రేక్.. డీజిల్ ఇంజిన్లతో రంగంలోకి రైల్వే.!
- RummyCulture Case :రమ్మీకల్చర్‌పై ఈడీ కొరడా.. రూ.442 కోట్ల ఆస్తులు అటాచ్!
కోర్టుకు క్షమాపణలు చెప్పిన రంగనాథ్
హైకోర్టు ఆదేశాల మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టులో అఫిడవిట్ సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన న్యాయస్థానానికి క్షమాపణలు తెలుపుతూ.. తనకు కోర్టుల అన్నా, న్యాయ వ్యవస్థ అన్నా ఎంతో నమ్మకం, గౌరవం ఉన్నాయని పేర్కొన్నారు. లోతుకుంటలోని ఆ 40 ఎకరాల స్థలంలోకి హైడ్రా సిబ్బంది అసలు వెళ్లలేదని, పిటిషనర్ కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని రంగనాథ్ తన అఫిడవిట్లో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే, కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనల తీరుపై తీవ్రంగా ఉన్న హైకోర్టు, ఆయనను బాధ్యతల నుంచి తొలగించాల్సిందేనని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తాజావార్తలు
-
The Paradise : నష్టాల దిశగా ప్యారడైజ్.. సండే రోజు బిగ్ డ్రాప్
-
Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
ట్రెండింగ్
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!