UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPI Charges: డిజిటల్ పేమెంట్స్ వాడుతున్న కోట్లాది మందికి ఈరోజు, అంటే సెప్టెంబర్ 28 సోమవారం చాలా కీలకమైన రోజు. యూపీఐ (UPI) లావాదేవీలకు సంబంధించిన ఒక ముఖ్యమైన కేసుపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన ఒక నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు ఎలా స్పందిస్తుందని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అసలు విషయమేంటంటే.. రూపాయిలు 2,000 కంటే ఎక్కువ విలువైన కొన్ని యూపీఐ ట్రాన్సాక్షన్లపై ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్’ (MDR) విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కొత్త నిబంధనను అక్టోబర్ 15 నుంచి అమల్లోకి తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, రూ.2,000 దాటిన ‘పర్సన్-టు-మర్చంట్’ (అంటే మనం దుకాణదారులకు లేదా వ్యాపారులకు చేసే) పేమెంట్లపై 0.4 శాతం చొప్పున MDR విధించడం వెనుక సరైన చట్టపరమైన రక్షణలు గానీ, పారదర్శకత గానీ లేవని, ప్రజల అభిప్రాయాలను కూడా తీసుకోలేదని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అందుకే ఈ కొత్త వ్యవస్థను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇక, MDR అంటే మనం డిజిటల్ పేమెంట్ చేసినప్పుడు ఆ లావాదేవీని ప్రాసెస్ చేసినందుకు గాను కస్టమర్ దగ్గర డబ్బులు స్వీకరించే వ్యాపారి లేదా దుకాణదారుడి నుంచి వసూలు చేసే ఛార్జ్ అన్నమాట. మరి ఈ ఛార్జీ వల్ల సామాన్య కస్టమర్ల జేబులకు చిల్లు పడుతుందా అంటే.. ఏమాత్రం పడదనే చెప్పాలి. ఇది సాధారణ ప్రజలకు పెద్ద ఊరట నిచ్చే అంశం. ఉదాహరణకు, మీరు ఒక షాప్‌లో రూ.5,000 విలువైన వస్తువులు కొని యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తే, 0.4 శాతం చొప్పున వచ్చే రూ.20ల MDR ఛార్జ్‌ను మీరు కట్టాల్సిన పనిలేదు. ఆ సొమ్మును సదరు వ్యాపారే చెల్లించాల్సి ఉంటుంది. దీనితో పాటు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మరికొన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. మీరు ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తి ఖాతాకు డబ్బులు పంపే ‘P2P’ ట్రాన్సాక్షన్లపై ఎలాంటి ఛార్జీలు ఉండవు, అది ఎంత మొత్తమైనా సరే పూర్తిగా ఉచితం. అలాగే రూ.2,000 వరకు వ్యాపారులకు చేసే చిన్న చిన్న పేమెంట్లపై కూడా ఎలాంటి MDR పడదు. ప్రస్తుతం అమల్లోకి రానున్న ఈ కొత్త డిజిటల్ ఛార్జీల విధానంపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఇప్పుడు అందరూ ఉత్కంఠగా వేచి చూస్తున్నారు.
Also Read
- Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
- Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
- Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. 'పెరి పెరి మసాలా'ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
- Six Centuries in One Day: సెంచరీల సండే.. ఒకే రోజులో 6 శతకాలు.. కోహ్లీ, గిల్ సహా దిగ్గజాల విధ్వంసం
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
-
Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
-
IndiGo Flight: ల్యాండింగ్‌కు ముందు రన్‌వేను తాకిన ఇండిగో విమానం.. గో-అరౌండ్తో తప్పిన ప్రమాదం
-
Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
ట్రెండింగ్
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!