Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli About Practices: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ నిర్దేశించిన 296 పరుగుల లక్ష్యాన్ని భారత్ 41.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌లో కింగ్ విరాట్ కోహ్లీ చెలరేగాడు. 88 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్సులతో 139 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ సెంచరీతో కింగ్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. వన్డే క్రికెట్లో 15,000 పరుగులు పూర్తి చేసిన కోహ్లీ.. ఈ ఘనతను అత్యంత వేగంగా అందుకున్న బ్యాటర్‌గా నిలిచాడు.
మైలురాళ్లపై పెద్దగా దృష్టి పెట్టను:
15 వేల వన్డే పరుగుల మైలురాయిని అందుకోవడంపై మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ స్పందించాడు. ‘వ్యక్తిగత మైలురాళ్లపై నేను ఎప్పుడూ పెద్దగా దృష్టి పెట్టను. జట్టు అవసరాలకు అనుగుణంగా పరిస్థితిని అర్థం చేసుకుని ఆడడమే నా లక్ష్యం. ఈ క్రమంలోనే వ్యక్తిగత రికార్డులు, విజయాలు నమోదవుతాయి. చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతున్నందుకు ఎంతో కృతజ్ఞతగా, అదృష్టంగా భావిస్తున్నా. ఈ స్థాయికి రావడానికి లభించిన అవకాశాలకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇంతకాలం క్రికెట్ ఆడే అవకాశం దక్కడం నిజంగా గొప్ప విషయం’ అని పేర్కొన్నాడు.
Also Read
- Six Centuries in One Day: సెంచరీల సండే.. ఒకే రోజులో 6 శతకాలు.. కోహ్లీ, గిల్ సహా దిగ్గజాల విధ్వంసం
- Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
- Virat Kohli Records: "నువ్వు మామూలోడివి కాదు సామీ".. ఒక్క సెంచరీతో ఏకంగా 10 సంచలన రికార్డులు బద్దలు..!
- ENG vs SL: శ్రీలంకకు చుక్కలు చూపించిన ఇంగ్లాండ్.. సిరీస్ కైవసం..!
తల దించుకుని కష్టపడాలి:
‘క్రికెట్లో ఎన్నో విజయాలు, రికార్డులు సాధించినప్పటికీ నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ప్రతిరోజూ తల దించుకుని కష్టపడటంపైనే నా దృష్టి ఉంటుంది. ఎంతో మంది ఈ స్థాయికి రావాలని కోరుకుంటారు. అలాంటి అవకాశాలు మాకు లభించినందుకు మును అదృష్టవంతులం. నా బ్యాటింగ్‌లో నిలకడకు ప్రధాన కారణాల్లో ఫిట్నెస్ కూడా ఒకటి. ప్రస్తుత దశలో శారీరకంగా చాలా ఫిట్‌గా ఉండటానికి ప్రాధాన్యత ఇస్తున్నా. క్రికెట్లో చాలా విషయాలు మైండ్‌కు సంబంధించినవే. అందుకే మానసికంగా తాజాగా ఉండటం కూడా ఎంతో ముఖ్యం’ అని కింగ్ చెప్పాడు.
ఎక్కువగా ప్రాక్టీస్ చేయను:
‘నా కెరీర్లో మూడు ఫార్మాట్లలో ఆడుతున్న సమయంలో కూడా మరీ ఎక్కువగా ప్రాక్టీస్ చేసేవాడిని కాదు. విపరీతంగా ప్రాక్టీస్ చేసే రకం నేను కాదు. ఈ విషయం మీ అందరికి తెలుసు. నాకు ఆటపై స్పష్టమైన అవగాహనతో పాటు ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టడం, మానసికంగా తాజాగా ఉండటం ముఖ్యం. మైదానంలో నా ఆటతీరును స్వేచ్ఛగా ప్రదర్శిస్తూ ఆ నిర్దిష్ట విధానానికి మరింత అలవాటు పాడుతా. అదే నన్ను ముందుకు తీసుకెళుతోంది. కెరీర్లో ఈ దశలో నా బ్యాటింగ్‌లో మరో గేర్ పెంచి ఆడటం నాకు కొత్త సవాల్‌గా ఉంది. ఒకటి, రెండు గేర్లు పైకి వెళ్లి మరింత దూకుడుగా ఆడే విధానాన్ని అలవాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా. ఈ దశలోనాలోని మరో కొత్త వెర్షన్‌ను ఆవిష్కరించుకోవడం నాకు ఉత్సాహాన్ని ఇస్తోంది. ఇది భారత్‌తో పాటు ఐపీఎల్లో నెను ప్రాతినిధ్యం వహించే జట్టుకు కూడా ఉపయోగపడుతుంది’ అని విరాట్ కోహ్లీ చెప్పాడు.
ఫ్రీ మైండ్ కోసం ఫిట్ బాడీ కావాలి:
మ్యాచ్‌లో స్వేచ్ఛగా ఆడటానికి ఫిట్నెస్ ఎంతో అవసరమని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. ఫ్రీ మైండ్‌తో ఆడటం తనకు ఎంతో సహాయపడుతోందని.. అయితే అలాంటి మానసిక స్వేచ్ఛ కోసం శరీరం ఫిట్‌గా ఉండటం అవసరమని చెప్పాడు. శారీరకంగా ఫిట్‌గా ఉన్నప్పుడే తాను మ్యాచ్‌ను తనకు నచ్చిన విధంగా ఊహించుకోగలుగుతున్నానని, తద్వారా మైదానంలో అనుకున్న విధంగా ప్రణాళికలను అమలు చేయడానికి అవకాశం లభిస్తోందని విరాట్ కోహ్లీ వివరించాడు. వెస్టిండీస్‌పై తొలి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించగా.. మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో కింగ్ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతం.
తాజావార్తలు
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
-
Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
-
IndiGo Flight: ల్యాండింగ్‌కు ముందు రన్‌వేను తాకిన ఇండిగో విమానం.. గో-అరౌండ్తో తప్పిన ప్రమాదం
ట్రెండింగ్
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!