Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
- వెస్టిండీస్‌పై తొలి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం
- తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 295 పరుగులు
- భారత్ 41.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 300 పరుగులు
- కుల్దీప్ బౌలింగ్‌తోనే మ్యాచ్ భారత్ వైపు మలుపు: గిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shubman Gill: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత క్రికెట్ జట్టు 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సెప్టెంబర్ 27న జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత్ కేవలం 41.4 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసి విహాయం సాధించింది. దీంతో 50 బంతులు మిగిలుండగానే టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టులో ఓపెనర్లు జాన్ క్యాంప్‌బెల్, జస్టిన్ గ్రీవ్స్ భారత్‌కు గట్టి సవాలు విసిరారు. క్యాంప్‌బెల్ 60 బంతుల్లో 62 పరుగులు చేయగా.. గ్రీవ్స్ 108 బంతుల్లో 101 పరుగులతో సెంచరీ సాధించాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 135 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీనితో ఒక దశలో వెస్టిండీస్ భారీ స్కోర్ చేస్తుందని అనుకున్నారు. అయితే భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బంతితో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. 10 ఓవర్లలో ఒక మెయిడిన్ వేసి కేవలం 40 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు. జాన్ క్యాంప్‌బెల్, జస్టిన్ గ్రీవ్స్, షై హోప్, జ్యువెల్ ఆండ్రూ వికెట్లను కుల్దీప్ తన ఖాతాలో వేసుకున్నాడు. అతనికి తోడుగా ప్రసిద్ధ్ కృష్ణ రెండు వికెట్లు, నితీశ్ కుమార్ రెడ్డి ఒక వికెట్ పడగొట్టాడు. చివర్లో అమీర్ జాంగూ 43 బంతుల్లో 58 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో వెస్టిండీస్ 295 పరుగులకు చేరుకుంది.
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
296 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించిన తర్వాత రోహిత్ శర్మ 35 బంతుల్లో 32 పరుగులు చేసి అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ కలిసి ఇన్నింగ్స్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గిల్ అద్భుతమైన బ్యాటింగ్‌తో 108 బంతుల్లో 110 పరుగులతో సెంచరీ సాధించి కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించాడు. ఇది గిల్ కు 10వ సెంచరీ. అయితే 34వ ఓవర్లో రోస్టన్ చేజ్ బౌలింగ్‌లో జ్యువెల్ ఆండ్రూకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. భారత్ 225 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
మరోవైపు విరాట్ కోహ్లీ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో వెస్టిండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 88 బంతుల్లోనే 139 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. గిల్ ఔటైన తర్వాత వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ 19 బంతుల్లో 13 పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. కోహ్లీతో కలిసి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఇక మ్యాచ్ అనంతరం భర్త కెప్టెన్ గిల్ మాట్లాడుతూ.. తన 110 పరుగుల ఇన్నింగ్స్‌పై సంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్‌ను చివరి వరకు క్రీజులో ఉండి ముగించి ఉంటే మరింత సంతోషంగా ఉండేదని అన్నారు. ఇన్నింగ్స్ ఆరంభంలో అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో కవర్స్ మీదుగా ఆడిన ఫ్రంట్‌ఫుట్ డ్రైవ్ తనకు ఇష్టమైన షాట్ అని వెల్లడించాడు.
కుల్దీప్ యాదవ్ ప్రదర్శనను కూడా గిల్ ప్రత్యేకంగా ప్రశంసించాడు. మిడిల్ ఓవర్లలో కుల్దీప్ లాంటి నాణ్యమైన స్పిన్నర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తే వికెట్లు సాధించగలడని, ఈ విషయాన్ని అతను మరోసారి నిరూపించాడని చెప్పుకొచ్చాడు. వెస్టిండీస్ ఓపెనర్ల భాగస్వామ్యం కొనసాగుతున్న సమయంలో భారీ స్కోరు వస్తుందని భావించామని, కానీ కుల్దీప్ మ్యాచ్‌ను భారత్ వైపు మలిచాడని గిల్ చెప్పాడు. అలాగే విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌పై కూడా గిల్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ ప్రస్తుతం పూర్తి స్వేచ్ఛతో బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తున్నాడని, అతని బౌండరీలు కొట్టే సామర్థ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నాడు. దేశం కోసం ఎన్నో మ్యాచ్‌లు గెలిపించిన కోహ్లీ వంటి దిగ్గజ ఆటగాడికి తనకు నచ్చిన విధంగా ఆడే స్వేచ్ఛ ఇవ్వాలని పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..