Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
- స్నాక్స్‌కు అదిరిపోయే రుచి కోసం..
- పెరి పెరి మసాలాను ఇంట్లోనే తయారు చేసుకోండి ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ పాప్‌కార్న్ లేదా గ్రిల్డ్ చికెన్ వంటి స్నాక్స్‌ను మరింత రుచికరంగా మార్చే వాటిలో ‘పెరి పెరి సీజనింగ్’ అత్యంత ప్రజాదరణ పొందింది. మార్కెట్లో లభించే ప్రిజర్వేటివ్స్ ఉన్న మసాలా పొడుల కంటే, ఇంట్లోనే లభించే దినుసులతో స్వచ్ఛమైన, పర్ఫెక్ట్ పెరి పెరి మసాలాను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు
* కాశ్మీరీ కారం: 4 టేబుల్ స్పూన్లు (60 గ్రాములు)
* స్మోక్డ్ పాప్రికా పొడి: 3 టేబుల్ స్పూన్లు (45 గ్రాములు)
* వెల్లుల్లి పొడి: 2 టేబుల్ స్పూన్లు
* ఉల్లిపాయ పొడి: 2 టేబుల్ స్పూన్లు
* ఎండిన ఒరేగానో: 2 టేబుల్ స్పూన్లు
* ఎండిన మరువం: 1.5 టేబుల్ స్పూన్లు
* నల్ల మిరియాల పొడి: 1.5 టేబుల్ స్పూన్లు
* తెల్ల మిరియాల పొడి: 1 టేబుల్ స్పూన్
* నిమ్మ పొడి లేదా సిట్రిక్ యాసిడ్ / నిమ్మ తొక్క పొడి: 1 టేబుల్ స్పూన్
* చక్కెర: 1 టేబుల్ స్పూన్
* ఉప్పు: 1.5 టేబుల్ స్పూన్లు
Also Read
- Saltలో ఈ ఒక్క మార్పు చేయండి.. లక్షలాది ప్రాణాలు కాపాడండి! పరిశోధనలో కీలక విషయాలు
- Viral Home Remedy: జ్వరం బిళ్లలతో ఎలుకలు పరార్.. ఇంట్లో ఇవి పెడితే చాలు అస్సలు కనిపించవు!
- Energy Drinks: ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా? పరిశోధనలో బయటపడ్డ నమ్మలేని నిజాలు
- How To Make Diya Without Oil: దీపావళికి ఖరీదైన దీపాలు వద్దు.. ఇంట్లోనే వాటర్ క్యాండిల్స్ తయారు చేయండిలా..
తయారీ విధానం
ముందుగా ఎండిన ఒరేగానో, మరువంలను చేతిలోకి తీసుకుని అరచేతుల మధ్య కాస్త నలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల వాటిలోని సువాసన, రుచి మరింత బాగా బయటకు వస్తాయి. ఆపై ఒక శుభ్రమైన, పొడిగా ఉన్న గాజు లేదా స్టీల్ గిన్నె తీసుకుని అందులో కాశ్మీరీ కారం, స్మోక్డ్ పాప్రికా పొడి, వెల్లుల్లి పొడి, ఉల్లిపాయ పొడి, నలిపిన ఒరేగానో, థైమ్, నల్ల మిరియాల పొడి, తెల్ల మిరియాల పొడి వేసుకోవాలి. ఆ తర్వాత పులుపు కోసం లైమ్ పౌడర్ లేదా సిట్రిక్ యాసిడ్, రుచిని సమతుల్యం చేయడానికి చక్కెర, ఉప్పు వేసుకోవాలి. అన్ని పదార్థాలు ఒకదానితో ఒకటి పూర్తిగా కలిసేలా స్పూన్ లేదా విస్కర్‌తో బాగా కలుపుకోవాలి. అంతే.. ఎంతో రుచికరమైన, ఘాటైన పెరి పెరి సీజనింగ్ సిద్ధమైనట్టే.
ఈ పెరి పెరి సీజనింగ్ను వేడివేడి ఫ్రెంచ్ ఫ్రైస్ లేదా ఆలూ కూరాలపై చల్లుకుని తినవచ్చు. అలాగే పెరి పెరి చికెన్ పాప్‌కార్న్, ఫ్రైడ్ చికెన్, గ్రిల్డ్ చికెన్, పనీర్ టిక్కా వంటి స్టార్టర్స్కు మ్యారినేషన్‌లో లేదా పైనుంచి చల్లుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. తయారైన పెరి పెరి సీజనింగ్ను గాలి చొరబడని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇలా చేస్తే ఈ మసాలా పొడి ఎక్కువ కాలం పాటు తాజాగా, మంచి సువాసనతో ఉంటుంది.
తాజావార్తలు
-
Story Board : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
-
CM Revanth Reddy : కొడంగల్‌పై సీఎం ఫోకస్.. రూ.9,100 కోట్ల పనులు
-
Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
-
Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
-
Off The Record: గులాబీ పార్టీకి Vitamin-M లోపం వచ్చిందా ? అందుకే ఆ మీటింగ్స్ రద్దయ్యాయా
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!