Wipro: హైదరాబాద్‌లో విప్రో విస్తరణ.. మరో 5000 మందికి ఉద్యోగాలు
- హైదరాబాద్‌లో విప్రో విస్తరణ..
- గోపనపల్లి క్యాంపస్ లో కొత్త ఐటీ సెంటర్..
- 5000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wipro: విప్రో కంపెనీ హైదరాబాద్ లో తమ క్యాంపస్ విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని గోపనపల్లిలో కొత్తగా మరో ఐటీ సెంటర్ నెలకొల్పతుంది. దీంతో అదనంగా 5000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ తో సమావేశమయ్యారు. అనంతరం ఈ కీలక ప్రకటన విడుదల చేశారు.
Read Also: Abhishek Sharma: ఆ ఇద్దరి కోసమే అలా చేశా.. అసలు విషయం చెప్పేసిన అభిషేక్ శర్మ!
Also Read
అయితే, విప్రో విస్తరణ ప్రణాళికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. విప్రో లాంటి పేరొందిన సంస్థలకు తగిన మద్దతు ఇచ్చేందుకు, వ్యాపారాలకు అనువైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధిలో విప్రో కీలక భాగస్వామిగా ఉంది. విప్రో క్యాంపస్ విస్తరణతో రాష్ట్రంలో సాంకేతిక రంగం మరింత వృద్ధి చెందనుంది అన్నారు. ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగనున్నాయి.. కొత్త ఐటీ సెంటర్ రాబోయే రెండు మూడేళ్లలో పూర్తవుతుంది.. ప్రభుత్వంతో విప్రో చేసుకున్న ఒప్పందంతో ప్రపంచ ఐటీ పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ ఖ్యాతి మరింత బలోపేతమవుతుంది అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Read Also: CM Chandrababu: వాళ్లు వెరీ రిచ్.. మేం వెరీ పూర్.. దావోస్‌లో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
ఇక, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు, అవకాశాలు సృష్టించడానికి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం తమకు ఉత్సాహంగా ఉందని ఈ సందర్భంగా విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ పేర్కొన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యం పంచుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు విప్రో కంపెనీని ఆహ్వానించారు.
తాజావార్తలు
-
Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
-
Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
-
MYSAA : రష్మిక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘మైసా’ రిలీజ్ డేట్ లాక్
ట్రెండింగ్
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!