Drugs Seized : హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత… భోపాల్ బస్సులో రూ.1.1 కోట్ల విలువైన మెథాంఫెటమిన్ సీజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్: నగరంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు భారీ డ్రగ్స్ రాకెట్‌ను గుట్టురట్టు చేశారు. భోపాల్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రైవేట్ ప్రయాణికుల బస్సులో తనిఖీలు చేపట్టి, సుమారు రూ.1.1 కోట్ల విలువైన 1.136 కిలోల మెథాంఫెటమిన్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఖచ్చితమైన నిఘా సమాచారం మేరకు DRI హైదరాబాద్ జోనల్ యూనిట్ (HZU) అధికారులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేయగా, స్లీపర్ బెర్త్‌ల పరుపుల కింద అత్యంత చాకచక్యంగా దాచిన నాలుగు అనుమానాస్పద ప్యాకెట్లను గుర్తించారు. ఫీల్డ్-టెస్టింగ్ కిట్ ద్వారా పరీక్షించగా, ఆ ప్యాకెట్లలో ఉన్నది నిషేధిత ‘మెథాంఫెటమిన్’ అని నిర్ధారణ అయింది.
Also Read
- TG Govt: ఎల్‌నినో ఎఫెక్ట్.. రేషన్ షాపుల్లో ఇక నుంచి గోధుమ పిండి, కారం, చింతపండుతో పాటు ఇతర సరుకులు కూడా..
- అక్రమ బాణాసంచా స్థావరాలపై టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు.. భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం!
- Hyderabad Crime: ప్రేమికుడి వేధింపులు.. యువతి ఆత్మహత్య
- BC Study Circle: బీసీ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకున్న విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ప్రతీ నెల ఇచ్చే స్టైఫండ్ పెంపు..
అధికారుల ప్రాథమిక విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సదరు స్లీపర్ బెర్త్‌లలో ప్రయాణించిన వ్యక్తులు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో బస్సు ఎక్కి, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దిగిపోయినట్లు తేలింది. డ్రగ్స్‌ను బస్సులోనే వదిలి వెళ్లడంపై అధికారులు ఆరా తీస్తున్నారు. పట్టుబడిన 1.136 కిలోల మెథాంఫెటమిన్‌ను ఎన్డిపిఎస్ (NDPS) చట్టం, 1985 కింద అధికారులు సీజ్ చేశారు. ఈ డ్రగ్ సరఫరా వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, హైదరాబాద్‌లో ఎవరికి డెలివరీ చేయాలనుకున్నారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Drugs Seized : హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత… భోపాల్ బస్సులో రూ.1.1 కోట్ల విలువైన మెథాంఫెటమిన్ సీజ్!
-
Tilak Varma: ఎవరికీ సాధ్యం కాలేదు.. బ్యాటింగ్ చేయకుండానే తిలక్ వర్మ ప్రపంచ రికార్డు..
-
Aneet Padda: టాలీవుడ్లోకి ‘సైయారా’ బ్యూటీ ఎంట్రీ?
-
CM Chandrababu: రాజకీయ నేతలే నేరాలకు పాల్పడే పరిస్థితి..! చంద్రబాబు ఫైర్
-
Donald Trump: ట్రంప్‌ను జైల్లో బంధించిన ఇరాన్..? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!