Uttam Kumar Reddy : కాళేశ్వరం పునరుద్ధరణకు ఆర్మీ ఇంజనీర్.. బీఆర్ఎస్ తీరుపై మంత్రి ఉత్తమ్ ఫైర్
- కాళేశ్వరం పనులకు ఆర్మీ ఇంజనీర్
- బీఆర్ఎస్పై ఉత్తమ్ తీవ్ర విమర్శలు
- ప్రాజెక్టు అంచనా వ్యయంపై ఆరోపణలు
- కాంగ్రెస్ హయాంలో రికార్డు పంట ఉత్పత్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పెద్దలు తెలంగాణ ప్రజలకు అబద్ధాలు, అసత్యాలు చెబుతూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు రిహాబిలిటేషన్ పనుల కోసం ఆర్మీలో పనిచేస్తున్న నిపుణ ఇంజనీర్ పరిక్షిత్ మెహ్రాను రాష్ట్ర ప్రభుత్వం డిప్యుటేషన్‌పై నియమించిందని వెల్లడించారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, అంతర్జాతీయ స్థాయి నిపుణుల సహాయంతో కాళేశ్వరం బ్యారేజీ పునరుద్ధరణ పనులను అప్పగించామని స్పష్టం చేశారు. ఏలాంటి రాజకీయ రంగు పులమకుండా పూర్తి పారదర్శకతతో ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
కమీషన్ల కోసం ప్రాజెక్టు అంచనాలు పెంపు.. భవిష్యత్తు తాకట్టు
తెలంగాణ ప్రజల కష్టాలకు పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని మంత్రి ఉత్తమ్ ధ్వజమెత్తారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పనే ఒక తప్పుడు నిర్ణయమని, కేవలం కమీషన్ల కోసమే దీన్ని భారీ వ్యయంతో నిర్మించారని ఆరోపించారు. ప్రాణహిత నది జలాలను ఉపయోగించి సులభంగా 16 లక్షల ఎకరాలకు నీరు అందించే అవకాశం ఉన్నప్పటికీ, నాణ్యతా లోపాలతో కూడిన నిర్మాణాల వల్ల బ్యారేజీలు కూలిపోయాయని విమర్శించారు. కేవలం రూ. 38 వేల కోట్ల అంచనా వ్యయాన్ని ఏకంగా లక్షన్నర కోట్లకు పెంచి మన పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం కోసం పెట్టిన ఖర్చును ఇతర ప్రాజెక్టుల కోసం కేటాయిస్తే లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని, కేసీఆర్ అండ్ కంపెనీ తెలంగాణ ఇరిగేషన్ రంగాన్ని సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు.
Also Read
- Drugs Seized : హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత... భోపాల్ బస్సులో రూ.1.1 కోట్ల విలువైన మెథాంఫెటమిన్ సీజ్!
- TG Govt: ఎల్‌నినో ఎఫెక్ట్.. రేషన్ షాపుల్లో ఇక నుంచి గోధుమ పిండి, కారం, చింతపండుతో పాటు ఇతర సరుకులు కూడా..
- అక్రమ బాణాసంచా స్థావరాలపై టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు.. భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం!
- Hyderabad Crime: ప్రేమికుడి వేధింపులు.. యువతి ఆత్మహత్య
జోసెఫ్ గోబెల్స్‌ను మించిన ప్రచారం.. బీఆర్ఎస్ నేతలపై విమర్శలు
రాష్ట్రంలో తలెత్తిన లోటు వర్షపాతానికి, ప్రస్తుత ఇబ్బందులకు బీఆర్ఎస్ పాలనా వైఫల్యమే కారణమని మంత్రి స్పష్టం చేశారు. ప్రాణహిత-చేవెళ్ల, ఎస్ఎల్బీసీ (SLBC), దేవాదుల, సీతారామ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఎల్‌నినో ప్రభావం రాష్ట్రంలో చాలా తక్కువగా ఉండేదని తెలిపారు. తమ ఘోర వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని, జోసెఫ్ గోబెల్స్‌ను మించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సంతోషించే తత్వం బీఆర్ఎస్ నాయకులదని విమర్శించారు. కన్నెపల్లికి వెళ్తున్న బీఆర్ఎస్ నేతలు.. ‘మేమే కట్టాము, మేమే కూల్చాము’ అని ప్రజలకు చెబుతారా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ హయాంలో రికార్డు స్థాయి పంట ఉత్పత్తి
కాళేశ్వరం బ్యారేజీలు నిరుపయోగంగా మారినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న సమర్థవంతమైన చర్యల వల్ల రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంట ఉత్పత్తి జరిగిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనతో పోలిస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే కృష్ణా, గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకుని ఎక్కువ పంటలు పండించామని వివరించారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, అబద్ధాలతో కాలం వెళ్లదీస్తున్న ప్రతిపక్షాల తీరును ప్రజలు గమనించాలని కోరారు.
తాజావార్తలు
-
Uttam Kumar Reddy : కాళేశ్వరం పునరుద్ధరణకు ఆర్మీ ఇంజనీర్.. బీఆర్ఎస్ తీరుపై మంత్రి ఉత్తమ్ ఫైర్
-
Adarsha Kutumbam : పేరేమో ఆదర్శ కుటుంబం.. కానీ చిన్న సినిమాలకు హారర్ కుటుంబం!
-
El Nino: ఎల్‌నినో రికార్డ్.. తొలిసారిగా 30°Cకు చేరిన ఉష్ణోగ్రతలు..
-
SS Rajamouli: గ్లోబల్ బాక్సాఫీస్‌పై జక్కన్న కన్ను.. ‘వారణాసి’ వరల్డ్‌వైడ్ థియేట్రికల్ !
-
RGV: ఆ అరెస్ట్‌లతో టైగర్ ష్రాఫ్ కేసు ఆగదు
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!