Bhatti Vikramarka : తెలంగాణకు సూపర్ ఎల్ నినో ముప్పు.. డిప్యూటీ సీఎం భట్టి కీలక విజ్ఞప్తి
- రాజకీయాలకు అతీతంగా సహకరించాలని భట్టి పిలుపు
- 71 శాతం చెరువుల్లో తగ్గిన నీటిమట్టాలు
- 20,018 మెగావాట్లకు చేరిన విద్యుత్ డిమాండ్
- నీటిని పొదుపుగా వాడాలని ప్రజలకు విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్రంలో తలెత్తిన తీవ్ర వాతావరణ పరిస్థితులు, విద్యుత్ డిమాండ్ , తాగునీటి లభ్యతపై కీలక ప్రకటనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా వంద దేశాల్లో ‘సూపర్ ఎల్ నినో’ ప్రభావం తీవ్రంగా ఉందని, దీనివల్ల భవిష్యత్తులో గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. లండన్ వంటి అంతర్జాతీయ నగరాల్లోనూ తాగునీటి వృథాను అరికడుతున్నారని, మహారాష్ట్రలో ఇప్పటికే నీటి వాడకంపై కోటాలు విధించారని గుర్తుచేశారు. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
రాజకీయ విమర్శలు పక్కనపెట్టి ప్రభుత్వానికి సహకరించాలి
కష్టకాలంలో కేవలం రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేయడం సరికాదని డిప్యూటీ సీఎం హితవు పలకారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా ప్రభుత్వాలకు ఏ విధంగానైతే అందరూ సహకరించారో, ప్రస్తుత ఎల్ నినో సంక్షోభాన్ని ఎదుర్కోవడంలోనూ ప్రతిపక్షాలు అదే విధంగా బాధ్యతయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తాగునీటి సమస్యను అధిగమించడానికి లభించే ప్రతి చుక్క నీటిని కేవలం తాగునీటి అవసరాలకే వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాజకీయ ప్రకటనలు మాని, ప్రజల మనుగడ కోసం అందరూ ఉన్నతమైన ఆలోచనలతో ముందుకు రావాలని కోరారు.
Also Read
- Pashamylaram Drug Raid: తెలంగాణలో భారీగా డ్రగ్స్ ముడిసరుకు ఫ్యాక్టరీ గుట్టురట్టు..
- Uttam Kumar Reddy : కాళేశ్వరం పునరుద్ధరణకు ఆర్మీ ఇంజనీర్.. బీఆర్ఎస్ తీరుపై మంత్రి ఉత్తమ్ ఫైర్
- Drugs Seized : హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత... భోపాల్ బస్సులో రూ.1.1 కోట్ల విలువైన మెథాంఫెటమిన్ సీజ్!
- TG Govt: ఎల్‌నినో ఎఫెక్ట్.. రేషన్ షాపుల్లో ఇక నుంచి గోధుమ పిండి, కారం, చింతపండుతో పాటు ఇతర సరుకులు కూడా..
క్షీణిస్తున్న నీటి వనరులు.. ఏడాదిపాటు సరిపడా ఆహార నిల్వలు
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా దాదాపు 71 శాతం చెరువుల్లో నీటిమట్టాలు గణనీయంగా క్షీణించినట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. రాబోయే పది నెలల పాటు ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా, జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. అయితే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో ప్రస్తుతం ఏడాది కాలానికి సరిపడా ఆహార పదార్థాల నిల్వలు సురక్షితంగా అందుబాటులో ఉన్నాయని భరోసా కచ్చారు. నీటి కొరతను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం వద్ద పక్కా ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు.
భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్
ఎల్ నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో విద్యుత్ వినియోగంపై అసాధారణ భారం పడుతోందని డిప్యూటీ సీఎం వివరించారు. గత సంవత్సరాలతో పోలిస్తే పీక్ డిమాండ్ విపరీతంగా పెరిగిందని గణాంకాలతో సహా చెప్పారు. 2014లో రాష్ట్రంలో కేవలం 6,648 మెగావాట్లుగా ఉన్న పీక్ డిమాండ్, 2023 నాటికి 15,497 మెగావాట్లకు, 2025 నాటికి 17,162 మెగావాట్లకు చేరిందని తెలిపారు. ప్రస్తుతం ఈ డిమాండ్ ఏకంగా 20,018 మెగావాట్లకు పెరిగిందని, ఒక్క అక్టోబర్ నెలలోనే విద్యుత్ డిమాండ్ 37 శాతం అధికంగా నమోదైందని వెల్లడించారు.
ముందస్తు ప్రణాళికతో విద్యుత్ సరఫరా
రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉన్నప్పటికీ, డిమాండ్ భారీగా పెరిగినప్పటికీ విద్యుత్ శాఖ ఎంతో సమర్థవంతంగా సరఫరా చేస్తోందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఎలాంటి అంతరాయాలు లేకుండా రైతులకు, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం ముందుచూపుతో కూడిన ప్రణాళికలతో మునుపటి కంటే మెరుగైన చర్యలు తీసుకుంటోందని ఆయన పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : తెలంగాణకు సూపర్ ఎల్ నినో ముప్పు.. డిప్యూటీ సీఎం భట్టి కీలక విజ్ఞప్తి
-
Meerut Blue Drum Case: హైకోర్టుకు ముస్కాన్, సాహిల్.. ఉరిశిక్షపై అప్పీల్.!
-
Prabhas: ఏంటి డార్లింగ్ ఇది.. ‘స్పిరిట్’ నుంచి ‘ఫౌజీ’ వరకు సేమ్ టు సేమ్!
-
Kolhapur Gold Theft: మామ ఇంట్లో బంగారం చోరీ చేసి థార్ కొనుగోలు.. కారు పూజకు మామే చీఫ్ గెస్ట్!
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
ట్రెండింగ్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!