* నేడు ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనానికి శంకుస్థాపన.. ఉదయం 11 గంటలకు రంగారెడ్డి జిల్లా మీర్ ఖాన్ పేటలో పునాది రాయి.. రావిర్యాల నుంచి అమనగల్ వరకు నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్-1 నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ..
* నేడు హైదరాబాద్ నగరంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన.. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని స్థానికులతో వీక్షించనున్న కిషన్ రెడ్డి.. అమీర్ పేట్ లో దివ్యాంగులకు వివిధ పరికరాలు పంపిణీ.. చింతల బస్తీలో బతుకమ్మ పండుగ వేడుకలకు హాజరుకానున్న కిషన్ రెడ్డి..
* నేడు గ్రూప్-2 ఫలితాలు విడుదల.. 783 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ పూర్తి..
* నేడు పింక్ రన్ సెకండ్ ఎడిషన్.. మెయిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పింక్ పవర్ రన్.. పీపుల్స్ ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్డు వరకు పరిగెత్తనున్న రన్నర్స్..
* నేటి నుంచి దక్షిణ కొరియాలో ఏపీ మంత్రుల పర్యటన.. దక్షిణ కొరియాలో పర్యటించనున్న మంత్రులు నారాయణ, బీసీ జనార్ధన్ రెడ్డి..
* నేడు ఐదో రోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. మోహిని అవతారంలో మలయప్ప స్వామి దర్శనం.. సాయంత్రం 6.30 గంటలకు గరుడ వాహనంపై భక్తులకు మలయప్ప స్వామిగా దర్శనం..
* నేడు 7వ రోజు ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు.. శ్రీమహాచండీ అవతారంలో భక్తులకు అమ్మవారి దర్శనం..
* నేడు ఆసియాకస్ ఫైనల్ మ్యాచ్.. ఫైనల్ మ్యాచ్ లో తలపడనున్న భారత్- పాక్.. దుబాయ్ వేదికగా రాత్రి 8 గంటలకు హైవోల్టేజ్ మ్యాచ్..