Voter ID: ఓటరు నమోదును సులభతరం చేసేందుకు ఎన్నికల సంఘం మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. అయితే.. గతంలో ఓటరు స్లిప్‌లో ఓటరు ఫొటో, వ్యక్తిగత వివరాలు ఉండేవి గుర్తున్నాయా? అయితే ఇప్పుడు చిన్న మార్పు చేశారు. ఓటరు ఫొటో స్థానంలో క్యూఆర్ కోడ్ పెట్టారు. ఆ ప్రక్రియలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం రెండు క్యూఆర్ కోడ్‌లను అందుబాటులోకి తెచ్చింది. సెల్‌ఫోన్ ద్వారా కోడ్‌ను స్కాన్ చేయగానే ఓటరు హెల్ప్‌లైన్ యాప్ అందుబాటులోకి వస్తుంది. ఇందులో ఓటరు నమోదు దరఖాస్తులు కూడా ఉన్నాయి.
Read also: CM Revanth Reddy: లా అండ్ ఆర్డర్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్.. డీజీపీకి సూచన
voters.eci.gov.inని యాక్సెస్ చేయడానికి మరొక కోడ్‌ని స్కాన్ చేయాలి. అందులోనూ ఓటరు నమోదుతోపాటు మార్పులు, చేర్పులకు సంబంధించిన దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయి. ఓటరు నమోదు దరఖాస్తులతో పాటు ఎన్నికలకు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. ఓటర్లు.. voters.eci.in వెబ్‌సైట్‌లోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఓటరు పేరు, వివరాలు, ఈపీఐసీ నంబర్, పోలింగ్ స్టేషన్ వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే ఓటు వేసేటప్పుడు ఓటర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తెలుసుకోవచ్చు. అయితే ఓటర్లు తమ వివరాలను తెలుసుకునేందుకు స్లిప్‌లు ఉన్నాయని, ఓటు వేయడానికి ఓటరు స్లిప్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు ఉండాలన్నారు.
TGSRTC MD Sajjanar: స్కూల్, కాలేజీ అమ్మాయిలే వాళ్ల టార్గెట్.. సజ్జనార్ ట్వీట్ వైరల్