TGSRTC MD Sajjanar: స్కూల్, కాలేజీ అమ్మాయిలే వాళ్ల టార్గెట్.. సజ్జనార్ ట్వీట్ వైరల్
- ఆడపిల్లలను కిడ్నాప్ చేశారంటూ వాట్సాప్ కాల్స్..
- జాగ్రత్త అంటూ సజ్జనార్ ట్విట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGSRTC MD Sajjanar: నగరంలో కొందరు కేటుగాళ్లు ఈజీగా డబ్బులు సంపాదించాలని మాస్టర్ ప్లాన్స్ వేస్తున్నారు. ఇక వీరి అత్యాశకు అమాయకపు ప్రజలు నిలువున మోసపోతున్నారు. ముఖ్యంగా ఈ సైబర్ నేరగాళ్ల జాబితాలో సామాన్యులు, సెలబ్రిటీలు, ప్రభుత్వ అధికారులు అనే తేడా లేకుండా అందర్నీ టార్గెట్ చేస్తూ లక్షల రూపాయాలు కొల్లగొడుతున్నారు. తాజాగా నగరంలో మరో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. అయితే ఈసారి సైబర్ కేటుగాళ్ల టార్గెట్ అమ్మాయిలే అంటూ టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.
Read also: MMTS: ప్రజలకు ఎంఎంటీఎస్ గుడ్ న్యూస్.. 17, 18 తేదీల్లో రాత్రి కూడ ప్రత్యేక రైళ్లు
Also Read
- Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
- Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
సజ్జనార్ ట్వీట్ లో ఏముందంటే..
ఆడపిల్లలను కిడ్నాప్ చేశారంటూ వాట్సాప్ కాల్స్.. జాగ్రత్త!! అంటూ ట్వీట్ చేశారు. స్కూల్స్, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలను కిడ్నాప్ చేశారంటూ తల్లిదండ్రులకు పోలీసుల పేరుతో సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్స్ చేసి బెదిరింపులకు దిగుతున్నారు. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే ఆడపిల్లలను కిడ్నాపర్లు చంపేస్తారంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. తాజాగా #Hyderabad రాయదుర్గంలో ఓ విద్యార్థిని తల్లిదండ్రులకు విదేశీ ఫోన్ నంబర్‌తో సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్ చేశారు. ”నేను పోలీస్ ఆఫీసర్ ను మాట్లాడుతున్నాను. కాలేజీకి వెళ్లిన మీ అమ్మాయి కిడ్నాప్‌నకు గురైంది. ఆమె ప్రస్తుతం మాదగ్గరే ఉందని అంటారు. ఆ వెంటనే మేం అడిగినంత డబ్బును ఆన్‌లైన్ ద్వారా పంపించండి. లేకుంటే మీ అమ్మాయిని కిడ్నాపర్లు చంపేస్తారు.” అని బెదిరించారు. ఇదిగో మీ అమ్మాయి ఏడుస్తుందంటూ ఒక వాయిస్‌ని వినిపించారు. ఏడుస్తున్న గొంతు వినిపించడంతో కాలేజీకి వెళ్లిన తమ కూతురు కిడ్నాప్‌నకు గురైందని తల్లిదండ్రులు భావించారు.
Read also: BRS Meeting: నేడు గాంధీ నివాసంలో బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశం.. భేటీపై ఉత్కంఠ..
డబ్బులు పంపించేందుకు సిద్దపడ్డారు. మోసగాళ్లతో ఫోన్‌లో మాట్లాడుతూనే తమ బంధువులకు ఈ విషయాన్ని చేరవేశారు. తమ కూతురు కాలేజీలో ఉందో.. లేదో తెలుసుకోండని వారిని పంపించారు. ఆమె కాలేజీలో క్షేమంగా ఉందని చెప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం నా దృష్టికి ఈ విషయాన్ని తీసుకువచ్చారు. ఈ తరహా బెదిరింపు ఫోన్ కాల్స్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వస్తున్నాయి. ఆడ పిల్లలను కిడ్నాప్ చేశారని చెప్పగానే నమ్మి వారికి డబ్బులు పంపిస్తున్నారు. అజ్ఞాత వ్యక్తుల నుంచి విదేశీ ఫోన్ నంబర్లతో వచ్చే వాట్సాప్ కాల్స్‌కు స్పందించకండి. బెదిరింపులకు జంకకుండా స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయండి.
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..