ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేయలేక డ్రామాలు ఆడుతోందని బీజేపీ నేతలు అంటుంటే.. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వలేదని టీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ నేతలు సైతం ధాన్యం కొనుగోళ్లు చేసిన రైతులకు న్యాయం చేయాలంటూ వరి దీక్షలకు కూడా దిగారు.
తాజాగా మాజీ పీసీసీ ఉత్తమ్‌కుమార్ మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మార్కెట్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని టీఆర్‌ఎస్‌కు చెప్పాలని హితవు పలికారు. అంతేకాకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం కనీసం గోనె సంచులు కూడా కొనలేదని ఆరోపించారు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోళ్లు జరిపి రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.