కొన్ని సందర్భాల్లో మీడియా ప్రదర్శించే అతి ఉత్సాహం సెలబ్రిటీలకు అసహనం కలిగిస్తోంది. ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించి కొన్ని సున్నితమైన సందర్భాల్లో మీడియా కెమెరాలతో ఇబ్బందులు పెడుతుంటారు. ఇక తాజాగా నటి షఫాలీ జరివాలా అకాల అంత్యక్రియల సందర్భంగా మీడియా వ్యవహరించిన తీరుపై పలువురు నటీనటులు తీవ్రంగా స్పందించారు.
Also Read : Rukmini Vasanth : రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదేలే..
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఈ వ్యవహారంపై ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ.. ‘ఇలాంటి సమయంలో ఒక కుటుంబం బాధలో ఉన్నప్పుడు వారి బాధను కూడా కవర్ చేయాలనుకోవడం బాధాకరం. అక్కడ షఫాలీ కుటుంబసభ్యులు చాలా అసౌకర్యంగా ఉన్నారు. ఈ తరహా మీడియా ఉత్సాహం వాళ్ల బాధను మరింత పెంచింది. దానివల్ల ఎవరికైనా లాభం ఉందా? నాకు అర్థం కావడం లేదు. నేను మీడియా స్నేహితులందరికీ ఒక్క అభ్యర్ధన చేస్తాను – దయచేసి అంత్యక్రియల వంటి బాధకరమైన క్షణాలు కవర్ చేయకండి. ఎవ్వరూ అది కోరుకోరు’ అని వ్యాఖ్యానించారు. అయితే ఈ పోస్టును నటి జాన్వీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరిలో షేర్ చేస్తూ.. ‘ఇప్పటికి ఈ విషయాం పై ఎవరు మాట్లాడారు’ అనే క్యాప్షన్‌తో మద్దతు తెలిపారు. జాన్వీ వ్యాఖ్యలతో ఆమె కూడా మీడియా తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు స్పష్టమవుతోంది.