Bhatti Vikramarka: బీసీ రిజర్వేషన్లపై ఐక్య ఉద్యమం.. ప్రధాని సమయం ఇస్తే సీఎం అధ్యక్షతన ఢిల్లీకి..
- రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎంపీల సమావేశం..
- బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం తొమ్మిదవ షెడ్యూల్లో సవరణ జరగాలి..
- ఈ అంశంపై పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేకంగా చర్చకు తీసుకురండి..
- ప్రధానిని కలిసి అన్ని పార్టీల ఎంపీలు ఒక వినతి పత్రాన్ని ఇవ్వండి..
- ప్రధాని సమయం ఇస్తే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka: ప్రజాభవన్‌లో నిర్వహించిన టెలంగాణ ఎంపీల సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ సమావేశం నిర్వహించామని తెలిపారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి పార్లమెంటు స్థాయిలో అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం తొమ్మిదవ షెడ్యూల్లో సవరణ తప్పనిసరని పేర్కొన్నారు. ఈ అంశాన్ని రాబోయే పార్లమెంటు సమావేశాల్లో అడ్జర్న్‌మెంట్ మోషన్ లేదా క్వశ్చన్ అవర్ ద్వారా చర్చకు తీసుకురావాలని సూచించారు. అన్ని పార్టీల ఎంపీలు కలిసి ప్రధానమంత్రిని కలిసి వినతి పత్రం ఇవ్వాలి. ప్రధాని సమయం ఇస్తే, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఢిల్లీకి వెళ్లేందుకు మేము సిద్ధంగా ఉన్నాం” అని భట్టి విక్రమార్క తెలిపారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఎంపీలు అడిగిన సమాచారం గంటల్లో అందించేందుకు ఢిల్లీలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినట్లు భట్టి తెలిపారు. నీటిపారుదల, విద్యుత్, జీఎస్టీ మరియు ఇతర కీలక రంగాలకు సంబంధించిన పెండింగ్ నిధులపై ఇప్పటికే కేంద్రానికి లేఖలు పంపినట్లు గుర్తు చేశారు. ఆ లేఖలు, సంబంధిత డాక్యుమెంట్లు ఎంపీలకు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
Read Also: India China Tensions: చైనా గూఢచర్యం.. క్షిపణి పరీక్ష షెడ్యూల్ మార్చిన భారత్!
Also Read
- Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
- Secunderabad: కంటోన్మెంట్లో బ్రిటిష్ పేర్లు తొలగింపు.. 21 రోడ్లు, 3 బజార్లకు వీర జవాన్లు, మహనీయుల నామకరణం!
- TG Registration Services: తెలంగాణలో రిజిస్ట్రేషన్ సేవలకు బ్రేక్.. ప్రభుత్వం కీలక ప్రకటన.. కారణం ఇదే..!
- CM Revanth Reddy : ఎల్బీనగర్ నా సొంతూరు లాంటింది.. కబ్జాదారులు ఎంతటి వారైనా వదిలేదే లేదు
మరోవైపు, 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చేందుకు అవసరమైన వనరులు, ప్రణాళికలు, అమలు రూపకల్పన రాష్ట్రం సిద్ధం చేసుకుంది అని భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణలో భాగంగా కేంద్ర మంత్రులు, ఎంపీలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఎంపీలకు ప్రపంచ స్థాయి సంస్థలు లేదా ప్రముఖులతో పరిచయాలు ఉంటే వివరాలు ఇవ్వండి. వారిని గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానిస్తాం” అని ఆయన అన్నారు. అయితే, రాజకీయాలు పక్కనపెట్టి — బీసీ రిజర్వేషన్లు, కేంద్ర నిధులు మరియు రాష్ట్ర అభివృద్ధి విషయాల్లో ఏకగ్రీవ పోరాటం చేయాల్సిన సమయం ఇదే అని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు అనుకూలంగా పార్లమెంట్ సభ్యులు అందరూ పార్టీలకు అతీతంగా ఒక బృందంగా ఏర్పడి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను విజ్ఞప్తులు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారని ప్రజాభవన్ లో ఎంపీల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు..
తాజావార్తలు
-
Indore: నీట్ పరీక్షకు మందు మరొక విద్యార్థిని బలి.. బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య
-
Jio IPO: వేల కోట్లు కొల్లగొట్టడానికి రెడీ అయిన జియో.. ఐపీఓపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన ముఖేష్ అంబానీ!
-
The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
-
JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
-
Nagadurga: సుకుమార్ – బన్నీ వాస్ బ్యానర్లలో క్రేజీ ప్రాజెక్ట్.. ప్రియదర్శి జోడీగా రంగంలోకి దిగిన ఫోక్ స్టార్!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్‌కు భారీ షాక్.. ప్రపంచ కప్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్‌తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?