Minister Komatireddy: బనకచర్ల ప్రాజెక్టును ఒప్పుకునే ప్రసక్తే లేదు.. ఇప్పటికే కృష్ణా జలాలను తీసుకెళ్లారు..
- బనకచర్ల ప్రాజెక్టును ఒప్పుకునే ప్రసక్తి లేదు..
- బనకచర్ల ఒకటే ఎజెండా పెడితే చర్చకు రాలేమని చెప్పాం..
- కృష్ణా జలాలను చంద్రబాబు, జగన్ అక్రమంగా తరలించారు: మంత్రి కోమటిరెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో కాసేపట్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగబోతుంది. ఈ భేటీపై లంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. బనకచర్ల ప్రాజెక్టును ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు. గోదావరి- బనకచర్ల ప్రాజెక్ట్ ఒకటే ఎజెండాగా పెడితే చర్చలకు రాలేమని కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పామన్నారు. అలాగే, ఇప్పటికే తెలంగాణకు సంబంధించిన కృష్ణా జలాలను చంద్రబాబు, జగన్ అక్రమంగా తరలించుకుపోయారని ఆరోపించారు. ఇక, భవిష్యత్ లో గోదావరి నదిపై నాసిక్ లో ప్రాజెక్టులో కడితే ఎండిపోతుంది.. అప్పుడు తెలంగాణ పరిస్థితి ఏం కావాలన్నారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే వింత అన్నారు.. కూలిపోతే ప్రపంచంలోనే వింత అవుతుంది.. మేడిగడ్డ మొత్తం కూలిపోతుందని ఎన్డీఎస్ఏ ఇప్పటికే రిపోర్టు కూడా ఇచ్చందని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు.
Read Also: Telugu CMs Meeting: ఢిల్లీకి చేరిన నీళ్ల పంచాయతీ.. కాసేపట్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ..!
Also Read
- Secunderabad Bonalu 2026: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలపై క్లారిటీ.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- ACB Raids: ఆదాయానికి మించిన ఆస్తులు.. డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ దాడులు.!
- Hyderabad: ఘనంగా మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2026 గ్రాండ్ ఫినాలే.!
- CM Revanth Reddy : SIRపై సీఎం రేవంత్ సీరియస్.. గాంధీ భవన్లో వార్ రూమ్.!
మరోవైపు, ఉప్పల్ ఫ్లైఓవర్ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నారపల్లి వరకు 8 కిలోమీటర్ల మేరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.. యాదగిరిగుట్ట భువనగిరి వరంగల్ హైవేపై దాదాపు 8 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఫ్లైఓవర్ పనులు ఆర్థిక వనరులు, ఇతర కారణాల వల్ల తీవ్ర జాప్యం జరిగింది.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఫ్లైఓవర్ పై ప్రత్యేక దృష్టి సారించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సైతం చర్చలు జరిపి పనుల్లో వేగం పెంచామన్నారు. కేంద్రాన్ని ఒప్పించి మొన్నటి వరకు పనులు నిర్వహించిన కాంట్రాక్టర్ను సైతం మార్చి కొత్తవారికి పనులు అప్పగించాం.. ప్రత్యేక శ్రద్ధతో పనుల్లో వేగాన్ని పెంచి త్వరితగతిన పనులు చేస్తు్న్నాం.. వచ్చే దసరా నాటికి ఫ్లైఓవర్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Crime News: రహస్యంగా పెళ్లి.. చివరకి భార్యకు విషం తాగించి, గొంతు నులిమి చంపాడు.. భర్తను పట్టించిన ఇన్‌స్టా స్టోరీ!
-
RBI New Rules: ఇక బ్యాంకుల దౌర్జన్యానికి చెక్.. ఆర్బీఐ న్యూ రూల్స్.. బ్యాంకు కస్టమర్లకు భారీ ఊరట
-
Prabhas Spirit : స్పిరిట్ క్రేజ్.. వారణాసి, డ్రాగన్, రాకాని క్రాస్ చేసిన రెబల్ స్టార్
-
FIFA World Cup 2026: సరికొత్త చరిత్ర సృష్టించిన lionel Messi.. అల్జీరియాపై హ్యాట్రిక్ గోల్స్ నమోదు.!
-
Prabhas : రెబల్ ఫ్యాన్స్ యుద్ధానికి సిద్ధమవండి!
ట్రెండింగ్
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్‌కు పండగే.. 12 గంటల పాటు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?
-
T20 World Cup 2026లో సంచలనం.. శ్రీలంక చరిత్రాత్మక విజయం.. డిఫెండింగ్ ఛాంపియన్‌కు వరుసగా రెండో షాక్!
-
6000mAh బ్యాటరీ, IP69 రేటింగ్, 50MP సోనీ కెమెరాతో TECNO SPARK 50 Pro లాంచ్.!