Prabhas Spirit : స్పిరిట్ క్రేజ్.. వారణాసి, డ్రాగన్, రాకాని క్రాస్ చేసిన రెబల్ స్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో, ముఖ్యంగా రెబల్ స్టార్ అభిమానుల్లో అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిన్న గ్యాప్ తర్వాత ప్రభాస్ మళ్లీ ‘స్పిరిట్’ సెట్స్‌లోకి అడుగుపెట్టినట్టుగా సమాచారం. ఈ కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోందని టాక్. అక్కడ ప్రభాస్‌పై కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమా క్రేజ్ ఎలా ఉందో ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషోలో నమోదవుతున్న ఇంట్రెస్ట్స్ (Interests) లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ‘స్పిరిట్’ చిత్రం ఏకంగా 130k+ ఇంట్రెస్ట్స్‌తో టాప్ ప్లేస్‌లో ఉంది. ఇప్పటి వరకు కేవలం ఒక్క పోస్టర్, ఆడియో గ్లింప్స్ మాత్రమే విడుదలైనప్పటికీ.. స్పిరిట్‌కు ఈ స్థాయి స్పందన రావడం విశేషం. ఇక రానున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చూస్తే.. ఎన్టీఆర్ డ్రాగన్ 78k+, మహేష్ బాబు ‘వారణాసి’ 62k+, అల్లు అర్జున్ ‘రాకా’ చిత్రానికి 10k+ ఇంట్రెస్ట్స్ నమోదయ్యాయి. ఏదేమైనా.. ఈ గణాంకాలు చూస్తే ప్రస్తుతం స్పిరిట్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. ‘స్పిరిట్’ అప్పుడే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం సృష్టించే దిశగా ఈ చిత్రం అడుగులు వేస్తోందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి స్పిరిట్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
తాజావార్తలు
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
-
SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
-
Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
-
Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!