Prabhas : రెబల్ ఫ్యాన్స్ యుద్ధానికి సిద్ధమవండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫౌజీ’. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా అప్డేట్స్ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ, మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. ఫస్ట్ లుక్ మినహా, ఇప్పటివరకు మరో అప్డేట్ ఇవ్వకుండా సైలెంట్‌గా షూటింగ్ కానిచ్చేస్తున్నారు.
అయితే ప్రస్తుతం ‘స్పిరిట్’ షూటింగ్‌తో బిజీగా ఉన్న ప్రభాస్.. తన ఫోకస్‌ను ‘ఫౌజీ’ వైపు మళ్లించాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని త్వరగా పూర్తి చేసేందుకు బల్క్ డేట్స్ కేటాయించినట్టుగా సమాచారం. అంతేకాదు.. వచ్చే నెలలో ‘ఫౌజీ’ టీజర్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. టీజర్‌తోనే సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించే అవకాశం ఉంది. నిజానికి వచ్చే దసరాకు ఫౌజీ రిలీజ్ కానుందని వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు డిసెంబర్లో భారీ ఎత్తున విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. ఈ సినిమాను డిసెంబర్ 3వ తేదీన విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం మేకర్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో డిజిటల్ రైట్స్ డీల్ క్లోజ్ చేసే పనిలో ఉన్నారు. ఈ ఓటీటీ బిజినెస్ పూర్తయిన వెంటనే అఫీషియల్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారట. కాగా, ఈ పీరియాడిక్ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్గా నటిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. మరి ఫౌజీ ఎలా ఉంటుందో చూడాలి.
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
తాజావార్తలు
-
MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
-
Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
-
IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?