Hyderabad: పెద్ద కొడుకు జైల్లో.. చిన్న కుమారుడు గంజాయి బానిస.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: నవమాసాలు మోసి, కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచిన బిడ్డలే తన బ్రతుకును నరకప్రాయం చేస్తారని ఆ తల్లి ఏనాడూ ఊహించి ఉండదు. రెక్కల కష్టం ధారపోసి, కడుపు కట్టుకుని పెద్ద చేసిన కుమారులు చేతికి అందివచ్చి తనకు ఆసరాగా నిలుస్తారని, ముసలితనంలో నీడగా ఉంటారని ఆశపడింది. కానీ, ఆ బిడ్డలే పెడదోవ పట్టి తన జీవితాన్ని తీవ్ర అంధకారంలోకి నెట్టేస్తారని గ్రహించలేకపోయింది. కన్నప్రేమ కరిగిపోయి, తీవ్ర మనోవేదన కన్నీటి చుక్కగా మారిన వేళ, ఆ తల్లి గుండె పగిలింది. చివరికి ఆ నిస్సహాయక తల్లి ఆత్మహత్య చేసుకుంది.
బాధితురాలిని రంగారెడ్డి జిల్లా జన్వాడ గ్రామానికి చెందిన తిరుపతి రవీందర్ భార్య సుధగా గుర్తించారు. ఆమె KPHB సర్దార్ పటేల్ నగర్‌లోని ఒక ప్రైవేట్ హాస్టల్లో హౌస్‌కీపింగ్ పనిచేస్తూ, అక్కడే ఒక గదిలో నివాసముంటోంది. సుధకు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కొడుకు కొన్నేళ్ల క్రితం కన్న తండ్రినే హత్య చేసిన కేసులో నిందితుడిగా చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇక చిన్న కొడుకు గంజాయికి బానిసై నిత్యం డబ్బుల కోసం, ఇతర విషయాల్లో తల్లిని తీవ్రంగా వేధించేవాడు. ఒక కొడుకు జైలుపాలు కావడం, మరో కొడుకు వ్యసనానికి బానిసగా మారి తనను వేధిస్తుండటంతో సుధ తీవ్ర మానసిక క్షోభకు గురైంది. భవిష్యత్తుపై ఆశ కోల్పోయిన ఆమె హాస్టల్ గదిలోనే ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపడుతున్నారు. సమాజంలో చెడు వ్యసనాలు, పెడదోవ పడుతున్న యువత వల్ల కుటుంబాలు ఏ విధంగా కూలిపోతున్నాయో చెప్పడానికి ఈ ఘటన ఒక సజీవ సాక్ష్యం. కన్నబిడ్డల బాధ్యతారాహిత్యం, మత్తు పదార్థాల మహమ్మారి ఒక అమాయక తల్లి ప్రాణాన్ని బలితీసుకోవడం సమాజ నైతికతకే తీరని కలంకమై నిలిచింది.
Also Read
- Itlu Arjuna : ఎన్టీఆర్‌ను ఫిదా చేసిన కొత్త హీరో: 'ఇట్లు అర్జున' ట్రైలర్ సంచలనం!
- Bethupalli Lake Accident: మత్స్యకారులను కాపాడబోయి చెరువులో SDRF సిబ్బంది గల్లంతు
- Diwali Firecracker Smoke: బాణసంచా పొగతో తలనొప్పి వస్తోందా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
- ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
తాజావార్తలు
-
Off The Record: మంత్రి పుట్టలో వేలు పెట్టారా? ఢిల్లీలో దామోదర వర్సెస్ ఎమ్మెల్యే!
-
Off The Record: మంత్రి వర్సెస్ ఎంపీ.. పెద్దపల్లి కాంగ్రెస్‌లో ఓపెన్ లెటర్ల వార్
-
Rakesh Varre : ‘బ్లడ్ బాత్’ సినిమాలకు చెక్.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మాయలేడి’తో వస్తున్నాం!
-
Off The Record: ఆవేదనా? ఆక్రోశమా? రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు కథ!
-
Nithiin Narne: షూటింగ్ స్పాట్లో తీవ్ర గాయం.. యంగ్ హీరో నితిన్ నార్నేకు సర్జరీ
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..