CP CV Anand: స్కూల్స్ స్టార్ట్ అయినా సందర్బంగా స్టూడెంట్స్ సేఫ్టీ మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ విధమైన అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జాయింట్ సీపీ, వారి సిబ్బందికి నా అభినందనలు.. పాఠశాలలు స్టార్ట్ అయినప్పుడు సేఫ్టీ సమస్యలు వస్తాయి.. వాటిని దృష్టిలో పెట్టుకుని అవగాహనా కలిగిస్తున్నాం.. పిల్లలు జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల 3 ఏళ్లలో 8 మంది మరణించారు అని పేర్కొన్నారు. విద్యార్థులు స్కూల్ బస్సులోనే ప్రయాణం చేస్తుంటారు, కాబట్టి ప్రతి పాఠశాలలో బస్సుల యొక్క సేఫ్టీ మెజర్స్ పాటించాలని తెలిపారు. పిల్లలకి ఎలాంటి సమస్య వచ్చిన యాజమాన్యందే బాధ్యత అన్నారు. సేఫ్టీ స్టాండర్డ్స్, కెమెరాస్, మెయింటెనెన్స్ ఎప్పుడూ ఉండేలాగా చూసుకోవాలన్నారు. ఎక్కేటప్పుడు దిగేటప్పుడు పరిసర ప్రాంతాలు గమనించాలి.. అక్కడే యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందని సీవీ ఆనంద్ వెల్లడించారు.
Read Also: Triumph Speed T4: అబాబ్బా.. ఆరెంజ్ కలర్‌లో బైక్ ఏమైనా ముద్దు వస్తుందా.. ఫీచర్స్, ధరలు ఇలా..!
అయితే, ఒక్క విద్యార్థి చనిపోయిన పాఠశాలకి పెద్ద సమస్యగా మారుతుంది అని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ప్రతి ఒక్క పాఠశాల పరిసరాలలో సీసీ కెమెరాస్ ఉండేలాగా చూసుకోవాలని సూచించారు. పిల్లలు స్కూల్స్ కి ఓవర్ లోడెడ్ ఆటోలల్లో కూడా వెళ్తున్నారు.. అలా వెళ్లడం వల్ల ప్రమాదాలు జరిగి.. మరణాలు సంభవించే అవకాశం కూడా ఉంటుంది.. తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. ఆటోలో డ్రైవర్ పిల్లలని ఎంత మందిని తీసుకువెళ్తున్నారో పేరెంట్స్ ఒకసారి గమనించాలని సూచించారు. స్కూల్ పరిసర ప్రాంతాలలో సైన్ బోర్డ్ ఉండేలాగా చూసుకోవాలి.. ఒకే ప్రాంతంలో ఎక్కువ స్కూల్స్ ఉన్న ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి.. అబిడ్స్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాలలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. అలాంటి ప్రాంతాలలో ట్రాన్సో పోర్టు, ట్రాఫిక్ సిబ్బంది సమన్వయంతో ప్రత్యేక టీమ్ ని ఏర్పాటు చేసేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సిటీ పోలీసులో 3 వేల మంది ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది మాత్రమే ఉన్నారు.. మొత్తం 650 జంక్షన్స్ ఉన్నాయి.. కాబట్టి, సిబ్బంది కొరత వల్ల అందులో 325 జంక్షన్స్ ను మాత్రమే డీఈవోనే చేయగలుగుతున్నామని సీపీ ఆనంద్ తెలిపారు.
Read Also: Viratapalem: PC Meena Reporting: ఆసక్తి రేకెత్తిస్తున్న ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ ట్రైలర్
ఇక, డ్రంకన్ డ్రైవ్ లో స్కూల్ బస్సు డ్రైవర్ పట్టుబడిన ఘటనపై స్పందించిన హైదరాబాద్ సీవీ ఆనంద్.. బ్రీత్ ఎనలైజర్ పరికరాలను స్కూల్ మేనేజ్మెంట్లు దగ్గర ఉంచుకోవాలి అన్నారు. బస్సు డ్రైవర్ల పరిస్థితిని బట్టి అవసరమైతే వారికి బ్రీత్ ఎనలైజర్ టెస్టులు చేయాలన్నారు. నిన్న మిట్ట మధ్యాహ్నం తాగిన తర్వాత స్కూల్ బస్సును నడిపించాడు డ్రైవర్.. మద్యం సేవించి స్కూల్ బస్సులు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాం.. స్కూల్స్ దగ్గర వైన్ షాపులు ఉంటే సమాచారం ఇవ్వండి.. అలాగే, పాఠశాలల దగ్గర పాన్ షాప్లలో మాదకద్రవ్యాలు అమ్ముతున్నట్లు సమాచారం వచ్చింది.. అలాంటి దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.