Triumph Speed T4: బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత ప్రీమియం బైక్ తయారీ సంస్థ ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ ఇటీవల భారత మార్కెట్లో తన ఉనికిని గణనీయంగా పెంచుకుంటోంది. నూతన డిజైన్, మంచి ఇంజిన్, డిజైన్, క్లాస్‌తో కూడిన ఫీచర్లతో యువతను ఆకట్టుకుంటున్న ఈ కంపెనీ ఇప్పుడు తమ పాపులర్ మోడల్ Speed T4 మోటార్ సైకిల్ కు కొత్త రంగును పరిచయం చేసింది. ట్రయంఫ్ సంస్థ తమ స్పీడ్ T4 మోడల్‌కు తాజాగా ‘బాజా ఆరెంజ్ (Baja Orange)’ అనే కొత్త కలర్‌ను విడుదల చేసింది. అయితే, ఈ కొత్త కలర్ వేరియంట్‌లో ఎలాంటి డిజైన్ మార్పులు లేదా మెకానికల్ అప్‌డేట్లు చేయలేదు. ఇది పూర్తిగా విజువల్ మార్పు మాత్రమే.
Read Also: Viratapalem: PC Meena Reporting: ఆసక్తి రేకెత్తిస్తున్న ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ ట్రైలర్
ఇంజిన్ & పవర్‌ట్రెయిన్ వివరాలు
ట్రయంఫ్ స్పీడ్ T4 బైక్‌లో 398.15 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కలిపి పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 30.6 హెచ్‌పీ శక్తిని @7,000 RPM వద్ద ఉత్పత్తి చేస్తుంది. అలాగే, 36 Nm టార్క్‌ను @5,000 RPM వద్ద అందిస్తుంది.
ఫీచర్లు :
ట్రయంఫ్ స్పీడ్ T4 బైక్‌లో నూతన తరానికి అనుగుణంగా ఆల్-ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ DRLs, రియర్ లైట్ సిగ్నేచర్ ఉంటాయి. అంతేకాక, అనలాగ్ స్పీడోమీటర్‌తో కూడిన మల్టీ ఫంక్షనల్ LCD స్క్రీన్, యుఎస్‌బీ పోర్ట్, డ్యూయల్ చానెల్ ABS వంటి ఫీచర్లు దాని నియో-రెట్రో లుక్‌కి మరింత ఆకర్షణను తీసుకొస్తాయి. కొత్తగా బాజా ఆరెంజ్ కలర్ చేరికతో, ఇప్పుడు ట్రయంఫ్ స్పీడ్ T4 మొత్తం ఐదు కలర్స్‌లో లభ్యమవుతుంది. కాస్పియన్ బ్లూ & పర్ల్ మెటాలిక్ వైట్, లావా రెడ్ గ్లోస్ & పర్ల్ మెటాలిక్ వైట్, ఫాంటమ్ బ్లాక్ & పర్ల్ మెటాలిక్ వైట్, ఫాంటమ్ బ్లాక్ & స్టోర్మ్ గ్రే లు ఇది వరకు ఉండగా బాజా ఆరంజ్ (కొత్త కలర్) కొత్తగా లాంచ్ అయ్యింది.
Read Also: Potatoes and Diabetes: షుగర్ పేషంట్స్ బంగాళదుంపలు తినవచ్చా..? నిపుణులు ఏమంటున్నారంటే..!
రూ. 1.99 లక్షలు ప్రారంభ ధరతో లభ్యమవుతున్న Triumph Speed T4 బైక్, మార్కెట్లో పలు క్రూయిజర్ బైక్స్‌కి గట్టి పోటిగా నిలుస్తోంది. ట్రయంఫ్ తన క్లాసిక్ స్టైలింగ్, ఆధునిక ఫీచర్లు, పోటీలో నిలిచే ధరలతో భారతీయ యువతలో మంచి గుర్తింపు సంపాదించుకుంటోంది. తాజా ‘బాజా ఆరెంజ్’ కలర్ వేరియంట్, స్టైలింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చే వారికి కొత్త ఆకర్షణగా నిలుస్తుంది. త్వరలో మరిన్ని కలర్ ఆప్షన్స్, వేరియంట్లు విడుదలయ్యే లేకపోలేదు.