‘రెక్కీ’ లాంటి సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ తర్వాత ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ అనే ఓ ఉత్కంఠ రేపే వెబ్ సిరీస్‌తో మేకర్లు రాబోతోన్నారు. కృష్ణ పోలూరు దర్శకత్వం వహించిన ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ వెబ్ సిరీస్ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోంది. అభిజ్ఞా వూతలూరు, చరణ్ లక్కరాజు నటించిన ఈ సిరీస్ జూన్ 27న ZEE5లో మాత్రమే ప్రీమియర్ కానుంది. ఈ క్రమంలో గురువారం నాడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ ట్రైలర్‌ను నవీన్ చంద్ర రిలీజ్ చేశారు.
Also Read:Malavika: ప్రభాస్ బాగా మాట్లాడతారు!
ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో..హీరోయిన్ అభిజ్ఞ మాట్లాడుతూ .. ‘‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ ట్రైలర్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంత మంచి కథను రాసిన దివ్య గారికి థాంక్స్. మూఢ నమ్మకాల మీద పోరాడే ఈ కథ అద్భుతంగా ఉంటుంది. ఈ కథను నాకు శ్రీరామ్ గారు చెప్పారు. అద్భుతమైన కథ అని నాకు అప్పుడే అర్థమైంది. ఇలాంటి కథలు, పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయి. దర్శకుడు కృష్ణ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. ఇంత మంచి కథల్ని ఎంకరేజ్ చేస్తున్న జీ5 టీంకు థాంక్స్. జూన్ 27న మా సిరీస్ రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు. కథా రచయిత్రి దివ్య మాట్లాడుతూ .. ‘‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ కథ 80వ దశకంలో జరుగుతుంది. కానీ ఇప్పటి తరానికి కూడా కనెక్ట్ అవుతుంది. మూఢ నమ్మకాల వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూపించబోతోన్నాం. కో రైటర్ విక్రమ్‌తో కలిసి కథను రాయడం ఆనందంగా ఉంది. జీ5లో జూన్ 27న మా సిరీస్ రాబోతోంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.