Ponnam Prabhakar: ఆంధ్రోళ్ల పై కౌశిక్ రెడ్డి మాట్లాడిన వీడియోను కేటీఆర్ కు పంపుతా అని కాంగ్రెస్ సీనియర్ నేత, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేసీఆర్ కూడా మాట్లాడారు.. ప్రాంతీయ తత్వం రెచ్చగొట్టాడన్నారు. మా పార్టీ విపరీత వ్యాఖ్యలు ఎప్పుడు చేయలేదని అన్నారు. బిర్యాని మాది..పెండ మిది అని అనలేదా ? అని ప్రశ్నించారు. మీ ఎంఎల్ఏ ఇప్పుడు మాట్లాడారన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. ఆంధ్రోళ్ల పై మాట్లాడిన వీడియో నీకు పంపుతా కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో శాంతి భద్రతలు భంగం వాటిల్లేలా చేస్తుంది ప్రతిపక్షం అంటూ మండిపడ్డారు. మీ ఎంఎల్ఏ రెచ్చ గొడితే తప్పు కాదా..? గాంధీ ఐనా కౌశిక్ ఐనా దాడులు తప్పు అని తెలిపారు. కేటీఆర్ అసహనంతో ఉన్నాడన్నారు.
Read also: KTR: హైదరాబాద్‌లో ఉన్న ప్రజలందరూ మా వారే.. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్..
పదేళ్లు అధికారంలో ఉండి..అధికారం పోవడంతో అసహనంలో ఉన్నాడన్నారు. పార్టీ ఫిరాయింపుల లో ప్రొఫెసర్లు బీఆర్ఎస్ వాళ్ళే అన్నారు. టీడీపీ ఎంఎల్ఏ లను , కాంగ్రెస్ ఎంఎల్ఏ లను మంత్రులను చేసింది బీఆర్ఎస్ అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేని మంత్రిని చేసింది బీఆర్ఎస్ అని గుర్తు చేశారు. మేము ఫిరాయింపుల ప్రోత్సహించలేదని క్లారిటీ ఇచ్చారు. మీరే మా సర్కార్ కూల్చుతం అన్నారు.. కాదా..? కూలగొడతం అంటే.. ఊరుకుంటారా ? అని ప్రశ్నించారు. బీజేపీతో బీఆర్ఎస్ సహకారం తీసుకుని మా సర్కార్ నీ దెబ్బతీసేలా మాట్లాడలేదా? అని అన్నారు. మా పై మాట్లాదేవాడే చిల్లర గాళ్ళు.. చిల్లర గాళ్ళ గురించి మాట్లాడొద్దు అని సీఎం చెప్పారన్నారు. మా పోలీసు అధికారులు కమిట్మెంట్ తో ఉన్న వాళ్ళే.. సీపీ కార్యాలయంలో ఏమైంది అనేది సీఎం సమీక్ష చేస్తారన్నారు.
Cabinet Meeting: ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ సమావేశం.. హైడ్రాపై చర్చ..