KTR: బతకడానికి వచ్చిన ఆంధ్రోళ్లు అంటూ కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్ లో పదేళ్లలో శాంతి భద్రతలు అద్భుతంగా మెయింటైన్ చేసాము. హైదరాబాద్‌లో ఉన్న ప్రజలందరూ మా వారే అన్నారు. ప్రాంతీయతత్వంపై దాడులు గతంలోనూ లేవని ఇప్పుడూ ఉండవని అన్నారు. బీఆర్ఎస్‌కు హైదరాబాద్ ప్రజలు అండగా నిలిచారని తెలిపారు. అందుకే సీఎం రేవంత్‌రెడ్డి కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ లో ఎందుకు చేరినవ్? దిక్కుమాలిన పీఏసీ పదవి కోసం ఇలాంటి మాటలు మాట్లాడిన గాంధీకి సిగ్గుండాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి నియోజకవర్గ ప్రజలను అడిగితే గాంధీ ఏపార్టీలో ఉన్నాడో చెబుతారని కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీని హౌజ్ అరెస్ట్ చేస్తే ఇలాంటి సంఘటనలు జరిగేవి కావని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం లో హేడ్ లైన్ మేనేజ్మెంట్ నడుతుందన్నారు. అసమర్థుడు జీవన్ యాత్ర లాగా పాలన నడుస్తుందని తెలిపారు. వంద రోజులలో అన్ని చేస్తామని చెప్పారు చేయలేదన్నారు.
Read also: Dr K Laxman: ప్రజాపాల దినోత్సవం అంటే ప్రజలను తప్పుదోవ పట్టించడమే..
2 లక్షల ఉద్యోగాలు 2 లక్షల రుణమాఫీ మహిళలకి 2500 ఇస్తామని చెప్పి రాష్ట్రం లో అన్ని వర్గాలనీ రేవంత్ మోసం చేశారన్నారు. బీఆర్ఎస్ నాయకులకు సమాధానం చెప్పలేక అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో విచిత్రమైన పాలన నడుస్తుందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ల కాళ్ళు ఏళ్ళు పట్టుకుని కాంగ్రెస్ లో జాయిన్ చేసుకున్నారన్నారు. 10 ఎమ్మేల్యేలు వచ్చారు మిగతా వాళ్ళు కూడా వస్తారని కాంగ్రెస్ నేతలు అన్నారని తెలిపారు. పిరయింపు దారుల పై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్నారు. పిరాయింపు చట్టం కిందికి వస్తుందని పార్టీ మారిన ఎమ్మేల్యేలు భయపడుతున్నారని తెలిపారు. పిరాయింపు దారుల పై చర్యలు తీసుకోవాలని kp వివేకానంద గౌడ్,కౌశిక్ రెడ్డి స్పీకర్ కు పిర్యాదు చేశారన్నారు. పిరాయింపు దారుల పై హై కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. పిరాయింపు దారులను రాజీనామా చేయమని చెప్పడం తప్పా? అని ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యే లను రాళ్ల తో కొట్టి చంపoడని రేవంత్ రెడ్డి చెప్పారు.. రేవంత్ రెడ్డి మాట్లడినట్టుగా మా నాయకులు మాట్లాడలేదన్నారు. అరికపుడి గాంధీ ఏ పార్టీ లో ఉన్నారు చెప్పాలి.. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ లో జాయిన్ అయ్యాను అన్నాడు.. ఇప్పుడు నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను అంటున్నాడని మండిపడ్డారు.
Read also: Cabinet Meeting: ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ సమావేశం.. హైడ్రాపై చర్చ..
అరికాపూడి గాంధీ అనుచరులు పోలీస్ ఎస్కార్ట్ తో మా ఎమ్మెల్యే పై దాడి కి వచ్చారన్నారు. పదేండ్ల లో ఎప్పుడు ఈ రకమైన దాడులు జరగలేదు.. చేతకాని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరగకుడని పని ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? అని ప్రశ్నించారు. 22 సార్లు డిల్లి కి ఇక్కడికి రేవంత్ తిరిగారు.ఏమి పికడానికి వెళ్ళారన్నారు. హైదారాబాద్ లో శాంతి భద్రతల కంట్రోల్ లో లేవన్నారు. అరికాపూడి గాంధీ ఏ పార్టీ లో ఉన్నావు చెప్పు.. పార్టీ మారిన అని చెప్పిన నాయకులు ఎక్కడ ఉన్నారో చెప్పండన్నారు. నీలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రులతో చాలా మందితో కొట్లాడామన్నారు. రాజశేఖర్ రెడ్డి చంద్రబాబుతో కొట్లాడినం నువ్వెంత బుల్లబ్బాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడికి ప్రోత్సాహం ఇచ్చిన పోలీస్ ల మీద కోర్టుకు వెళుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం ఎప్పటికీ పోరాటం చేస్తూనే ఉంటామన్నారు.
Read also: Okra Water: బెండ నీటితో బోలెడు ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు..
మా ఎమ్మెల్యేలను అక్రమ అరెస్ట్ లు చేస్తే ముఖ్యమంత్రి సొంత నియోజక వర్గం లో చుక్కలు చూపించాము.. పాలమూరు ప్రజల పౌరుషాన్ని రేవంత్ కు చూపించారమన్నారు. అరికాపూడి గాంధీకి పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చారు..మా వాళ్ళను హౌజ్ అరెస్ట్ చేశారు. ప్రాంతీయ తత్వం ను చిల్లర ముఖ్యమంత్రి రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. పదేండ్లు హైదారాబాద్ ప్రశాంతంగా ఉంది.హైదారాబాద్ లో మాకు అత్యధిక సీట్లు ఇచ్చారు..అందుకే రేవంత్ హైదారాబాద్ ప్రజల మీద కక్ష పెట్టుకున్నాడు. హైదారాబాద్ ప్రజల మీద రేవంత్ రెడ్డి పగ పట్టారు. అందుకే హైడ్రా పేరిట కూల్చుతున్నారు.రేవంత్ రెడ్డి కి ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడంతో ఇవన్నీ చేస్తున్నారని అన్నారు. హైదారాబాద్ లో ఉండే వాళ్ళు అంత మావాళ్లే.. కమెడియన్ కంటే ఎక్కువ హాస్యం పండిస్తున్నావు అరికాపుడి గాంధీ. శేరిలింగంపల్లిఓటర్ లకు మొన్న ఏమి హామీ ఇచ్చావు.. కేసీఆర్-కేటీఆర్ అభివృద్ధి చేసారు.. నాకు ఓటు వేయండని అడిగావని తెలిపారు. శేరిలింగంపల్లి ఓటర్ లను అడగండి వాళ్ళ ఎమ్మెల్యే ఏ పార్టీ లో ఉన్నారో అడగాలని కేటీఆర్ తెలిపారు.
KTR: హైదరాబాద్ చేరుకున్న కేటీఆర్.. రెండు వారాల తర్వాత నగరానికి..