Police Firing Nampally: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున మరోసారి కాల్పుల కలకలం రేగింది. నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. దీంతో ఇద్దరు వ్యక్తులు పోలీసులపై గొడ్డలితో దాడికి యత్నించాడు.. మరోవ్యక్తి పోలీసులపై రాళ్లు విసిరాడు. తనిఖీలు చేస్తుండగా పోలీసులపై దాడికి యత్నించడంతో అప్రమత్తమై పోలీస్ డెకాయ్ టీం వెంటనే పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులకి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వారిని వెంటనే ఉస్మానియా దవాఖానకు తరలించారు. కాల్పుల్లో గాయపడ్డ వారిని అనీస్, రాజ్ గుర్తించారు. గాయపడ్డ వారితోపాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు గాల్పుల్లో గాయపడ్డ వారు దోపిడి దొంగలుగా అనుమానిస్తున్న వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. నగరంలో ఐదవ సారి సిటీ పోలీసులు కాల్పులు జరిపడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఆసుపత్రిలో కాల్పులకు గాయపడ్డ నిందితుడికి చికిత్స కొనసాగుతుంది. ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో ఉస్మానియా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాలికి బుల్లెట్ తగలడంతో కొద్దిసేపటి క్రితమే బుల్లెట్ తొలగించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని , ఎలాంటి ప్రాణహాని లేదని వైద్యులు చెలిపారు.
Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
కొద్ది రోజుల క్రితం ఎల్బీ నగర్ సమీపంలో పార్డి ముఠాపై పోలీసులు కాల్పులు జరిపి అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. గత వారం హైదరాబాద్‌లో దొంగల ముఠాను పట్టుకునేందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది. నల్గొండ జిల్లా చిట్యాల వద్ద జాతీయ రహదారిపై కారులో నిద్రిస్తున్న దంపతులపై ముగ్గురు వ్యక్తులు కారు అద్దాలు పగులగొట్టి నగలు దోచుకెళ్లారు. అయితే ఈ క్రమంలో హయత్ నగర్ మీదుగా ఎల్బీనగర్ వైపు వెళ్తున్న ఆటోను నిందితులు ట్రాక్ చేశారు. ఎల్బీ నగర్ వద్ద వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పోలీసులపై తిరగబడ్డారు. దీంతో నిందితుడిపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. తాజాగా నాంపల్లి రైల్వే స్టేషన్‌లో జరిగిన ఘటనపై స్పష్టత రావాల్సి ఉంది.
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?