Hyderabad: హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో గల రెడ్ స్టోన్ హోటల్ లో దారుణం చోటు చేసుకుంది. నర్సింగ్ స్టూడెంట్ అనుమానాస్పద మృతికి గురైంది. రేప్ అండ్ మర్డర్ చేసి ఆత్యహత్యగా చిత్రీకరిస్తున్నారనీ మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి రెడ్ స్టోన్ హోటల్ లో ఇద్దరు అమ్మాయిలు రెండు గదులు తీసుకున్నారు. ఇవాళ (సోమవారం) ఉదయం ఓ గదిలో శృతి అనే నర్సింగ్ స్టూడెంట్ చనిపోయింది.
Read Also: Road Accident: బీఎండబ్ల్యూ బీభత్సం.. గాల్లోకి ఎగిరిపడ్డ ఇద్దరు యువతులు!
అయితే, పోలీసులు శృతి మృతదేహాన్ని అంబులెన్స్ లోకి ఎక్కిస్తుండగా మృతురాలి బంధువులు అడ్డుకున్నారు. ఆ డెడ్ బాడీతో రెడ్ స్టోన్ హోటల్ ముందు ఆందోళనకు దిగారు. శృతిని రేప్ చేసి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. అత్యాచారం చేసి ఉరివేసి చంపారని అంటున్నారు. కాగా, గదిలో ఎక్కడపడితే అక్కడ రక్తం మరకలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. గదిలో పెద్ద ఎత్తున బీరు బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. గదిలో మొత్తం ముగ్గురు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. గది మొత్తం చిందర వందరగా ఉండడంతో గొడవ జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హోటల్ గదిలోని రూంలో తాడుకు వేలాడుతూ కనిపించిన శృతి మృతిహాన్ని పోలీసులు రికవరీ చేసుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీం ఫోరెన్సిక్.. ప్రస్తుతానికి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.