సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసారు చిక్కడపల్లి పోలీసులు. ఈ వార్త ఒక్కసారిగా ఒక్కసారిగా సంచలనంగా మారింది. కాసేపటి క్రితం అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న పోలీసులు ఉన్నపళంగా అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకువెళ్లారు. అదే విధంగా బన్నీ మొత్తం నాలుగు సెక్షన్స్ కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసారు. బన్నీఅరెస్ట్ చేసే సమయంలో అల్లు అరవింద్ అక్కడే ఉన్నారు. బన్నీ తో పాటు అరవింద్ కూడా స్టేషన్ కు వెళ్లారు.
Also Read : Allu Arjun : అల్లు అర్జున్ అరెస్ట్, నాన్ బెయిలబుల్ కేసు నమోదు
కాగా పోలీసుల తీరుపై అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేసారు. ఉన్నపళంగా తమతో రావాలంటే ఎలా, పోలీసులు తీసుకెళ్లడంలో నాకు అభ్యంతరం లేదని, కనీసం బట్టలు మార్చుకునేందుకు కూడా అవకాశం ఇవ్వరా అని అన్నారు. బన్నీ అరెస్ట్ నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసు స్టేషన్ కు అల్లు అర్జున్ తరపు లాయర్లు చేరుకున్నారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేస్తారా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఒకవేళ కోర్టుకు వెళ్లాల్సి వస్తే మాత్రం ఈరోజే వెళ్లాల్సిన పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ హైకోర్టుకు రేపు రెండవ శనివారం హాలిడే కావడం, ఆ తరువాత ఆదివారం సెలవు. కోర్టుకి వెళ్లి బెయిల్ తెచ్చుకుంటే ఓకే లేదంటే రెండు రోజులు జైల్లో ఉండాల్సి వస్తుందని సమాచారం. బన్నీ అరెస్ట్ తో చిక్కడపల్లి పోలీసు స్టేషన్ కు పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు చేరుకుంటున్నారు. ఈ కేసులో ఏమి జరుగుతుందోనేనే ఉత్కంఠ నెలకొంది.