Swarnandhra @ 2047 Vision Document: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు.. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో కార్యక్రమంలో.. ఐశ్వర్య, ఆరోగ్య, ఆనందాంధ్రప్రదేశ్ సాకారమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించారు.. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్‌క ల్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, నారాయణ, ఆనం రాంనారాయణరెడ్డి, పార్థసారథి, సత్యకుమార్ యాదవ్, .. తదితర మంత్రులు.. నేతలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పది సూత్రాలు.. ఒక విజన్ పేరిట డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు సీఎం చంద్రబాబు.. స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ జాతికి అంకితం చేస్తూ సంతకం చేశారు..
Read Also: PCB: పాకిస్థాన్‌కు వరుస షాక్‌లు.. గుడ్‌బై చెప్పిన జాసన్ గిలెస్పీ!
ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు. విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియం చేరుకుని మొదట వివిధ రకాల స్టాల్స్ ని పరిశీలించారు.. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక గీతం మా తెలుగు తల్లికి మల్లె పూదండతో, స్వర్ణాంధ్ర 2047 విజన్ కార్యక్రమం ప్రారంభం అయ్యింది.. ఆ తర్వాత ఐశ్వర్య, ఆరోగ్య, ఆనందాంధ్రప్రదేశ్ సాకారమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించారు సీఎం చంద్రబాబు నాయుడు. సంతకం చేసి జాతిక అంకితం చేశారు.. ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మంత్రులు.. పలువురు అధికారులు విజన్ డాక్యుమెంట్‌పై సంతకాలు చేశారు..