Minister Seethakka: ఫుడ్ పాయిజన్ వెనక కుట్ర ఉంది.. మంత్రి సీతక్క సంచలన కామెంట్..
- తెలంగాణలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ ఘటన..
- ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర ఉంది..
- కుట్ర వెనక ఎవరున్నారు అనేది బయట పెడతామన్న మంత్రి సీతక్క..
- దిలావర్పూర్ లో పరిశ్రమకు అనుమతి ఇచ్చింది బీఆర్ఎస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Seethakka: ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర ఉందని మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ ఘటనలు రాజకీయ రగడకు దారితీసింది. తాజాగా ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయంపై సీతక్క స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర ఉందని తెలిపారు. కుట్ర వెనక ఎవరున్నారు అనేది బయట పెడతామని అన్నారు. కుట్ర దారులు వెనక అధికారులు ఉంటే.. ఉద్యోగాలు తీసేస్తాం అని హెచ్చరించారు. ఇందులో రాజకీయ పార్టీ కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
Read also: Bhudaan Lands: డిసెంబర్ 6న హాజరు అవ్వండి .. ఎమ్మార్వోతో పాటు నలుగురికి నోటీసులు..
Also Read
- Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కొత్త హెల్త్ స్కీమ్ డ్రాఫ్ట్ విడుదల.!
- Telangana RERA : తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు ఊరట.. RERA ప్రాజెక్టులకు 4 నెలల గడువు.!
- Telangana SIR : తెలంగాణ ఓటర్లకు గుడ్‌న్యూస్.. SIR గడువు మరోసారి పొడిగింపు.!
- CM Revanth Reddy : పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు TOMCOMదే బాధ్యత
ఆ.. పరిశ్రమకు అనుమతి ఇచ్చింది బీఆర్ఎస్- సీతక్క ఆగ్రహం..
ఇక దిలావర్పూర్ లో పరిశ్రమ ఘటనపై మంత్రి మాట్లాడుతూ.. దిలావర్పూర్ లో పరిశ్రమకు అనుమతి ఇచ్చింది బీఆర్ఎస్ అని అన్నారు. 2023 లోనే అనుమతి ఇచ్చారని మంత్రి స్పష్టం చేశారు. ఇథనాల్ కంపనీకి అనుమతి ఇచ్చింది బీఆర్ఎస్-బీజేపీ అన్నారు. ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకోకుండా అనుమతి ఇచ్చింది కేటీఆర్ అన్నారు. నిశీగ్గుగా మాపై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇథనాల్ కంపెనీలో డైరెక్టర్లుగా మాజీ మంత్రి తలసాని కుమారుడు తలసాని సాయి ఉన్నాడని తెలిపారు. ఎక్కడెక్కడో తిరుగుడు ఎందుకు కేటీఆర్.. దిలావర్పూర్ పోదాం రండి అని అన్నారు. చిల్లర రాజకీయాలు ఆవసరమా..? కేటీఆర్ అని మండిపడ్డారు. డ్రామాలు ఆడటం మానుకోవాలని సూచించారు.
Read also: BRSV State Secretary: బీఆర్ఎస్వీ స్టేట్ సెక్రటరీ నాగారం ప్రసాద్ అరెస్ట్..
విచ్చల విడిగా గ్రామ సభలు లేకుండా అనుమతి ఎలా ఇచ్చారని కేటీఆర్ పై మండిపడ్డారు. తలసాని వియ్యకుండు మరో భాగస్వామి అన్నారు. మీ తప్పులు కప్పిపుచ్చుకుని మాపై నిందలు మోపడం కరెక్ట్ కాదన్నారు. కేటీఆర్..నీకు చిత్తశుద్ధి అంటే దిలావర్‌పూర్‌కి రా..? అని సవాల్ విసిరారు. కడప వాళ్లకు కంపనీకి ఇచ్చింది కేటీఆర్ అని సీతక్క తెలిపారు. అన్నీ వివరాలు బయట పెడతామన్నారు. కేటీఆర్‌కు నీతి.. రీతి..జాతీ ఉంటే కంపనీకి అనుమతి ఇచ్చింది నువ్వే అని ఒప్పుకోవాలని అన్నారు. అసెంబ్లీ లో దీనిపై చర్చ చేస్తామన్నారు. స్పీకర్ ముందు చర్చ పెడతామని తెలిపారు. రేపు మీరు ఇచ్చిన అనుమతి వివరాలు బయట పెడతామని సీతక్క తెలిపారు.
CM Revanth Reddy: కుల సర్వేలో కుటుంబ వివరాలు నమోదు చేసుకున్న సీఎం..
తాజావార్తలు
-
Trump-Iran: ఈ వారాంతంలో ఇరాన్‌పై భారీ దాడి జరగనుందా? వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం
-
Janhvi Kapoor: ‘రాకా’లో జాన్వీ కపూర్ ఎంట్రీ?.. వైరల్ ఫొటోతో మొదలైన కొత్త రచ్చ!
-
CM Chandrababu: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్రకు కొత్త చరిత్ర.. దశ, దిశ మారనున్నాయి..
-
Secret Soldier : టైటిల్ మారింది.. ‘సీక్రెట్ సోల్జర్’గా వస్తున్న ‘చైనా పీస్’!
-
GST Collections July 2026: దేశ ఆర్థిక వ్యవస్థకు బిగ్ బూస్ట్.. జూలైలో GST వసూళ్లు రూ.2.11 లక్షల కోట్లు
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!