BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా దిగ్గజ స్పిన్నర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pragyan Ojha Named Interim BCCI Chief Selector: భారత క్రికెట్లో పురుషుల సెలెక్షన్ కమిటీకి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవి నుంచి తప్పుకోవడంతో.. ప్రస్తుతం నలుగురు సభ్యుల జాతీయ సెలెక్షన్ కమిటీకి మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా తాత్కాలిక అధిపతిగా బాధ్యతలు చేపట్టారు. భవిష్యత్‌లో ఆయననే తదుపరి చీఫ్ సెలెక్టర్‌గా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
వెస్టిండీస్‌తో రెండో వన్డేకు ముందు భారత జట్టు గువాహటికి చేరుకున్న అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ జాతీయ సెలెక్షన్ కమిటీ సభ్యులతో సుదీర్ఘంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. బర్సాపరా స్టేడియం వేదికగా సెలెక్టర్లు శివ సుందర్ దాస్, అజయ్ రాత్రా, ఆర్పీ సింగ్, ప్రజ్ఞాన్ ఓజాతో గంభీర్ చర్చలు జరిపినట్లు సమాచారం. అజిత్ అగార్కర్ మాత్రం ఈ సమావేశానికి హాజరు కాలేదు. సాధారణంగా ద్వైపాక్షిక సిరీస్ సమయంలో నలుగురు సెలెక్టర్లు ఒకేసారి జట్టుతో ఉండటం అరుదుగా కనిపిస్తుంది. దీంతో గంభీర్‌తో సెలెక్షన్ కమిటీ సభ్యుల సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా త్వరలో జరగనున్న న్యూజిలాండ్ పర్యటనకు భారత జట్ల ఎంపికపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
Also Read
- Virat Kohli: విరాట్ కోహ్లీకి ఏమైంది..11 ఏళ్లలో తొలిసారి ఇలా..
- Kapildev: టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఈ ఇద్దరు దిగ్గజాలు పెద్ద తప్పు చేశారు..
- Surya Kumar Yadav: టీమ్‌లోకి మళ్లీ సూర్యకుమార్ యాదవ్..? బ్యాటింగ్‌లో మరోసారి విధ్వంసం..
- Rajat Patidar: 48 బంతుల్లో 135 పరుగులు.. ఆర్సీబీ కెప్టెన్ వీరవిహారం..
న్యూజిలాండ్ పర్యటన కోసం భారత సెలెక్టర్లు జట్లను ఎంపిక చేయాల్సి ఉంది. ఇండియా ‘ఏ’ జట్టు మూడు టెస్టులతో పాటు టీ20, వన్డే జట్లను కూడా ఎంపిక చేయాల్సి ఉంది. అదే సమయంలో భారత సీనియర్ టెస్టు జట్టును కూడా ఎంపిక చేయాల్సి ఉంటుంది. నవంబర్ 15న టౌరంగాలో చివరి వన్డే జరగనుండగా.. నవంబర్ 19న వెల్లింగ్టన్లో తొలి టెస్టు ప్రారంభం కానుంది. దీంతో వన్డే జట్టులో ఉన్న కొందరు టెస్టు ఆటగాళ్లను ముందుగానే విడుదల చేసి టెస్టు సిరీస్ కోసం సన్నాహకాలకు పంపే అంశంపైనా సెలెక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ దృష్టి సారించే అవకాశం ఉంది.
భారత జట్టు అక్టోబర్ 22 నుంచి నవంబర్ 27 వరకు న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో ముందుగా ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. అక్టోబర్ 22న క్రైస్ట్‌చర్చ్‌లో తొలి టీ20తో సిరీస్ ప్రారంభమవుతుంది. అనంతరం నవంబర్ 4 నుంచి ఆక్లాండ్ వేదికగా ఐదు వన్డేల సిరీస్ మొదలవుతుంది. ఈ పర్యటన చివర్లో రెండు టెస్టులు జరగనున్నాయి. నవంబర్ 19న వెల్లింగ్టన్లో తొలి టెస్టు, అనంతరం క్రైస్ట్‌చర్చ్‌లో రెండో టెస్టు ఉంటుంది. ఇదే సమయంలో ఇండియా ‘ఏ’ జట్టు కూడా న్యూజిలాండ్‌లో పర్యటించి అక్టోబర్ 24 నుంచి నవంబర్ 10 వరకు మూడు టెస్టులు ఆడనుంది.
2027 వన్డే ప్రపంచ కప్ సన్నాహాలు ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో న్యూజిలాండ్ పర్యటన భారత జట్టు కూర్పు, ఆటగాళ్ల పనిభారం, వివిధ ఫార్మాట్లలో కలయికలను అంచనా వేయడానికి కీలకంగా మారనుంది. దీంతో సెలెక్టర్లు, కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య జరిగిన తాజా సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ప్రజ్ఞాన్ ఓజా తాత్కాలికంగా సెలెక్షన్ కమిటీకి నాయకత్వం వహిస్తున్న నేపథ్యంలో.. రాబోయే రోజుల్లో భారత క్రికెట్లో సెలెక్షన్ వ్యవస్థలో మరిన్ని మార్పులు చోటుచేసుకుంటాయా అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Success Story: ఐఐటీ కుర్రాడి క్రేజీ బిజినెస్ ఐడియా.. కుల్దీప్ సక్సెస్ స్టోరీ కచ్చితంగా చదవాల్సిందే!
-
Fire Accident: చర్లపల్లి రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం.. తగలబడిన బోగీలు..
-
Virat Kohli: విరాట్ కోహ్లీకి ఏమైంది..11 ఏళ్లలో తొలిసారి ఇలా..
-
India Summit Row: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఏడు సూచనలు.. “బీజేపీని శత్రువుగా చూడొద్దు” అంటూ హితవు!
-
Kapildev: టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఈ ఇద్దరు దిగ్గజాలు పెద్ద తప్పు చేశారు..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!