కేసీఆర్ ఉద్యమ ద్రోహులను దగ్గర చేర్చుకున్నాడు : లక్ష్మణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బండి సంజయ్ అరెస్ట్‌పై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బండి సంజయ్ ప్రజాస్వామ్య యుతంగా జాగరణ దీక్ష చేపట్టారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఇది పతనానికి నాంది అని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం జరిగిందే స్థానికత అంశం మీద అని, స్థానికతకు ఈ ప్రభుత్వం చరమ గీతం పాడిందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ఉద్యమకారులను వదిలి ఉద్యమ ద్రోహులను దగ్గర చేర్చుకున్నాడని, మూడు సంవత్సరాలు నిద్రపోయిన ప్రభుత్వం మూడు రోజుల్లో అదరబదరగా ఉద్యోగ విభజన చేయాలని అనుకుందని ఆయన అన్నారు.
ఉద్యోగ సంఘాల నేతల నోళ్లు మూత పడ్డాయని, కోవిడ్ నిబంధనలు అధికార టీఆర్‌ఎస్ పార్టీ కి ఉండవా అని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ఘాతుకాలు చూడలేదని ఆయన అన్నారు. బీజేపీ కార్యకర్తల చేతులు, కాళ్ళు విరిగాయని, పోలీసుల దౌర్జన్యాలతో బీజేపీ బెదిరిపోదని ఆయన స్పష్టం చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో 333 సెక్షన్ లేదు… బెయిల్ వస్తుంది అని చివరలో 333 ని యాడ్ చేశారు… పాత కేసులన్ని పెట్టారు. గ్యాస్ కటర్, గడ్డపారలతో క్యాంప్ ఆఫీసు డోర్ లు కిటికీలు కమిషనర్ సమక్షంలో పగల గొట్టారు.. ఇదేనా ప్రజా స్వామ్యం. రాజకీయంగా, న్యాయ పరంగా పోరాడుతాం. బెంగాల్, కేరళ లాగా ప్రభుత్వమే హింసాత్మక సంఘటనలకు పాల్పడడం కరెక్ట్ కాదని లక్ష్మణ్ మండిపడ్డారు.
Also Read
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- Off The Record: తెలంగాణలో అధికారమే లక్ష్యం.. సింగరేణి నుంచే ఆపరేషన్ మొదలు?
- Pawan Kalyan: రేపు హైదరాబాద్‌కు పవన్ కల్యాణ్.. ఫిజియోథెరపీ తప్పనిసరి
- TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
తాజావార్తలు
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
-
StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్‌ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్‌కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!