Piyush Goyal : వికసిత్ భారత్ సాధనలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలి
- వికసిత్ భారత్ లక్ష్య సాధనలో తెలంగాణ కీలకం
- తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలపై పీయూష్ గోయల్ ప్రశంసలు
- ఏఐ, లైఫ్ సైన్సెస్లో హైదరాబాద్కు గుర్తింపు
- కొత్త రంగాల్లో పెట్టుబడులు పెంచుకోవాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ వేదికగా నిర్వహించిన ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్య సాధన కోసం భారతీయులమంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఊహించినదాని కంటే వేగంగా వృద్ధి సాధిస్తోందని, మధ్య ఆసియా సంక్షోభం వంటి సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ సంప్రదాయ అంచనాలను అధిగమించి ఎగుమతులు పెంచుకున్నామని ఆయన వెల్లడించారు. ప్రపంచంలోని తొలి ఐదు ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒక వెలుగు వెలుగుతోందని కొనియాడారు.
చరిత్ర నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు.. పారిశ్రామిక స్థిరత్వం
ఈ సందర్భంగా చారిత్రక అంశాలను ప్రస్తావిస్తూ.. ఏడు వందల సంవత్సరాల క్రితమే కాకతీయ గణపతి చక్రవర్తి నౌకా వాణిజ్యంపై మోటుపల్లి శాసనం వేయించారని పీయూష్ గోయల్ గుర్తుచేశారు. నాడే వ్యాపారులు తమ పెట్టుబడులకు భద్రతను, విధాన నిర్ణయాల్లో స్థిరత్వాన్ని కోరుకున్నారని, నేడు ఆధునిక పారిశ్రామికవేత్తలు కూడా అవే ఆశిస్తున్నారని తెలిపారు. వికసిత్ భారత్ సాకారం కావాలంటే అన్ని రాష్ట్రాలు, అన్ని రంగాల్లో సత్తా చాటాలని ఆకాంక్షించారు.
Also Read
- OTR: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్! BRS వ్యూహం ఏంటి?
- Tragedy: అది ఆత్మహత్య కాదు.. ఫోన్ ఎక్కువగా వాడుతోందని కుమార్తెను గొంతు నులిమి చంపిన కన్నతల్లి..
- Miyapur Land Dispute : మియాపూర్ భూములపై సుప్రీం కీలక తీర్పు.. ప్రభుత్వానికి భారీ ఊరట
- El Nino Impact : ఎల్నినో దెబ్బ.. తెలంగాణలో 23.40 లక్షల ఎకరాల్లో పంట నష్టం
తెలంగాణ వృద్ధి ప్రణాళికలపై ప్రశంసలు
2047 నాటికి తెలంగాణను బలమైన ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి పెట్టుకున్న లక్ష్యాలను పీయూష్ గోయల్ స్వాగతించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ సంపూర్ణ భాగస్వామిగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జీసీసీ (GCC), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్ అగ్రగామిగా దూసుకుపోతోందని ప్రశంసించారు. రాష్ట్రంలోని ఫార్మా, బయోటెక్ రంగాలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాయని పేర్కొంటూ.. భవిష్యత్తులో ఏరోస్పేస్, డిఫెన్స్, క్వాంటం కంప్యూటింగ్ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు
తెలంగాణలో లభించే జీఐ (GI) ట్యాగ్ కలిగిన తాండూరు కందులు, నిజామాబాద పసుపు వంటి అత్యుత్తమ ఉత్పత్తులను ఇప్పటికే ఆస్ట్రేలియా వంటి దేశాలకు ఎగుమతి చేశామని తెలిపారు. సులభతర వాణిజ్య (Ease of Doing Business) అవకాశాలను మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పెట్టే ప్రతి పెట్టుబడి, సృష్టించే ప్రతి ఉద్యోగం తెలంగాణ స్థానిక అభివృద్ధితో పాటు దేశ లక్ష్యమైన ‘వికసిత్ భారత్’కు బలమైన పునాది వేస్తాయని పీయూష్ గోయల్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Piyush Goyal : వికసిత్ భారత్ సాధనలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలి
-
OTR: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్! BRS వ్యూహం ఏంటి?
-
OTR : యనమల ఫ్యామిలీలో విభేదాలు.. తుని మున్సిపల్ ఎన్నికల్లో కూటమికి చిక్కులేనా?
-
YS Jagan: స్థానిక ఎన్నికల్లో అక్రమాలు.. శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి..
-
Om Movie: ఎర్రచందనం స్మగ్లింగ్ సినిమా కాదు.. ధనుష్ ‘ఓం’ స్టోరీ పాయింట్ చెప్పిన డైరెక్టర్!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?